గ్రామాభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థే పునాది
సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్
కాకతీయ, శంకరపట్నం: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శంకరపట్నంలో నిర్వహించిన వేడుకల్లో సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి, పారదర్శక పాలనకు పంచాయతీరాజ్ వ్యవస్థే వెన్నెముక అని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడంలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులకు చేరవేయడంలో పంచాయతీలు వారధిగా పనిచేస్తున్నాయని సర్పంచ్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని, ప్రతి ఒక్కరూ గ్రామ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్, గ్రామ కార్యదర్శి నరసయ్య, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాముఖ్యతను వివరిస్తూ పలువురు నేతలు ప్రసంగించారు.

