జనగామ కలెక్టరేట్లో వాసవీ మాత జయంతి
కాకతీయ, జనగామ: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం వాసవీ మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జయంతిని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు. మహనీయుల జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ద్వారా వారి స్ఫూర్తిని చాటిచెబుతోందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి యువజన, క్రీడల అభివృద్ధి శాఖ అధికారి కోదండ రాములు, ఆర్యవైశ్య సంఘం కుల పెద్దలు, నాయకులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వాసవీ మాత చూపిన శాంతి, అహింస మార్గాలను స్మరించుకుంటూ జయంతిని వైభవంగా జరుపుకున్నారు.

