తెలంగాణ నూతన డీజీపీగా సీవీ. ఆనంద్
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ-హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీ.వీ. ఆనంద్ నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (G.O.Rt.No. 553) జారీ చేసింది. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను డీజీపీగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన సీ.వీ. ఆనంద్‌కు పోలీస్ శాఖలో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన హైదరాబాద్ సీపీగా, ఏసీబీ డీజీగా సహా పలు కీలక బాధ్యతల్లో పనిచేశారు. యూపీఎస్‌సీ (UPSC) పంపిన ముగ్గురు పేర్ల జాబితాను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. సీ.వీ. ఆనంద్ వైపే మొగ్గు చూపింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే ఈ నియామకం అమల్లోకి రానుంది. ఈ నియామకం పట్ల పోలీస్ శాఖలో హర్షం వ్యక్తమవుతోంది.


