epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వైద్య, ఆరోగ్యశాఖలో 18 వేల ఉద్యోగాలు

వైద్య, ఆరోగ్యశాఖలో 18 వేల ఉద్యోగాలు
నిరుద్యోగులకు త్వరలోనే తీపి కబురు
విద్యా, వైద్యం, మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం
బాలసదనాలు, అంగన్‌వాడీల అభివృద్ధికి  సీఎస్‌ఆర్ నిధుల వినియోగం
మంత్రి దామోదర్ రాజనర్సింహ
నర్సింగ్ ఆఫీసర్లు, మల్టీపర్పస్ ఏఎన్‌ఎం ఫలితాల విడుదల
కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఇందులో భాగంగానే రికార్డు స్థాయిలో వైద్య, ఆరోగ్యశాఖలో సుమారు 18 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టామని తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో రూరల్ డెవలప్‌మెంట్ నిధులతో నిర్మించిన బాలసదనం నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ముగింపు వారోత్సవాల సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మల్టీపర్పస్ ఏఎన్‌ఎంలు, నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను అతి త్వరలోనే అధికారికంగా విడుదల చేసి నియామక పత్రాలు అందజేస్తామని ప్రకటించారు.
అంగన్‌వాడీలు, బాలసదనాల పరిరక్షణ‌
రాష్ట్రంలో బలహీన వర్గాలు, మహిళలు, చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే బాలసదనాలను, అంగన్‌వాడీ కేంద్రాలను కాపాడుకునే గురుతర బాధ్యతను ప్రభుత్వం భుజాన వేసుకుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రభుత్వ గ్రాంట్లతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను జోడించి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మిస్తామని, అక్కడ ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్‌వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలతో పాటు మూడేళ్ల లోపు చిన్నారులకు పోషకాహార బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నామని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు, వ్యాక్సినేషన్ సేవలు అందిస్తున్న ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తల నిస్వార్థ సేవలను ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా కొనియాడారు. అనంతరం బాలసదనంలోని బాలికలతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, అక్కడ తక్షణమే రక్షిత మంచినీటి ఆర్ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
దివ్యాంగులకు  స్కూటీల పంపిణీ..
ఈ పర్యటనలో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని పలువురు అర్హులైన దివ్యాంగులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉచితంగా త్రీవీలర్ స్కూటర్లను అందజేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవాలలో భాగంగా జిల్లాలో చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ల క్లీనింగ్ డ్రైవ్, 18 ఏళ్లు పైబడిన అనాథ పిల్లలను గుర్తించి వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించడం, వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా హెల్త్ కార్డులు అందజేయడం వంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారులు మంత్రికి నివేదించారు. ఆశ్రమాల నుంచి బయటకు వచ్చిన పిల్లలకు పునరావాసం కల్పించి రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నామని వివరించారు. ఈ ప్రగతి సమీక్షా కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్, సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి, మున్సిపల్ కమిషనర్ ప్రశాంత్, సీడీపీఓ సుజాత, ఆశ్రమ నిర్వాహకురాలు విజయకుమారి తదితర ఉన్నతాధికారులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.