ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచాలి..
*కొమ్మాల గ్రామంలో ప్రత్యేక బడిబాట కార్యక్రమం నిర్వహణ..
కాకతీయ,గీసుగొండ:ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొమ్మాల గ్రామ సర్పంచ్ కన్నెబోయిన యమున అన్నారు. మండలంలోని కొమ్మాల గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామ పెద్దలు,ఉపాధ్యాయులు గ్రామంలోని వీధి వీధికి తిరుగుతూ తల్లిదండ్రులను కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య,మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలే పట్టుగొమ్మలని సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమానికి తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్‌ఎస్ కొమ్మాల ప్రధానోపాధ్యాయులు ఎస్. మోహన్ రావు,ఉపాధ్యా యులు ఎన్.మాలతి,వీబీ పద్మ,ఎల్.రాజిరెడ్డి,డి.సాగర్, బి.కరుణాకర్,ఎల్. భాగ్యమ్మ, విద్యాభిమాని తోగిటి బ్రహ్మచారి,ప్రవీణ్,గ్రామ పెద్దలు,యువజనులు,ప్రజలు పాల్గొన్నారు.

