epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీజేపీ కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ యత్నం.. ముదురుతున్న ఉద్రిక్తత!

కరీంనగర్‌లో ఆగని రణరంగం
బీజేపీ కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ యత్నం.. ముదురుతున్న ఉద్రిక్తత!
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి ప్రతిచర్య
వందలాదిగా బీజేపీ ఆఫీస్ వైపు తరలుతున్న బీఆర్ఎస్ శ్రేణులు
పరస్పర దాడులతో రణరంగంగా మారిన కరీంనగర్
రెండు పార్టీల కార్యకర్తల మధ్య బాహాబాహీ
ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు
ప్రధాన కూడళ్లలో లాఠీచార్జ్, భారీగా అరెస్టులు.

కాకతీయ, కరీంనగర్: కరీంనగర్‌లో రాజకీయ యుద్ధం మునుపెన్నడూ లేని విధంగా ముదురుతోంది. గురువారం ఉదయం ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ క్యాంపు కార్యాల‌యంపై దాడి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ నాయ‌కులు య‌త్నించ‌డానికి నిరసనగా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు ప్రతిదాడికి సిద్ధమయ్యారు. వందలాదిగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో నగరం హై వోల్టేజీ ఉద్రిక్తతతో అట్టుడుకుతోంది. ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగడంతో కరీంనగర్ ప్రధాన వీధులు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నాయి.

బీజేపీ ఆఫీస్ దిశగా బీఆర్ఎస్ సైన్యం.. పోలీసుల ఉక్కుపాదం!
తన క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో కరీంనగర్ బీజేపీ కార్యాలయం వైపు దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. “బండి సంజయ్ డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేస్తూ బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

నగరంలో అప్రకటిత కర్ఫ్యూ.. గస్తీలో ఉన్నతాధికారులు!
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న ఈ దాడుల పరంపరతో కరీంనగర్ వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకు సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించారు. నగరంలోని ప్రధాన చౌరస్తాల వద్ద వందలాది మంది పోలీసులు పహారా కాస్తున్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు, దానికి ప్రతిగా కౌశిక్ రెడ్డి ఇచ్చిన కౌంటర్లు చివరకు నగరాన్ని అశాంతి వైపు నెట్టేశాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క బీజేపీ నేతలు తమ కార్యాలయాన్ని కాపాడుకునేందుకు మోహరించగా, మరోపక్క బీఆర్ఎస్ శ్రేణులు దాడిని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ హై వోల్టేజీ డ్రామాతో కరీంనగర్‌లో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.