రూ.35లక్షలతో సీసీ డ్రైన్ పనులకు శ్రీకారం
మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
అభివృద్ధిలో కరీంనగర్ పట్టణం ముందంజ
కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్
కాకతీయ, కరీంనగర్ : నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నగరంలోని 44వ డివిజన్ పరిధిలో మున్సిపల్ సాధారణ నిధులు రూ. 35 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో కాలనీవాసులు మురుగునీటి సమస్యతో ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి డివిజన్‌లో ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని, నాణ్యతతో కూడిన పనులకే మొగ్గు చూపుతున్నామని వివరించారు. ప్రజల సహకారంతో కరీంనగర్‌ను పరిశుభ్రమైన, సుందరమైన మోడల్ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తో పాటు స్థానిక కార్పొరేటర్ చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

