epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రోహింగ్యాల‌కు అడ్డాగా ఖ‌మ్మం

రోహింగ్యాల‌కు అడ్డాగా ఖ‌మ్మం
అండ‌గ‌గా నిలుస్తున్న మాజీమంత్రి అజ‌య్ ఖాన్‌
ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కు కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ నేత‌ల మ‌ద్ద‌తు
బెంగాల్‌లో ఏరేసిన‌ట్లుగా ఇక్క‌డా అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను వెళ్ల‌గొట్టాలి
బీజేపీ ఖ‌మ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
మే 10న భాగ్యనగరానికి కదలిరావాలంటూ బీజేపీ శ్రేణుల‌కు పిలుపు
ఖమ్మం నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డి

కాకతీయ,ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరం రోహింగ్యాలకు అడ్డాగా మారిందని, మాజీ మంత్రి అజయ్ కుమార్ వారికి ‘అజయ్ ఖాన్’లా మారి అండగా నిలుస్తున్నారని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులను ఏరివేసినట్లుగానే, ఖమ్మంలోనూ వారిని గుర్తించి వెళ్లగొట్టాలని డిమాండ్ చేశారు. అక్రమ రవాణా, వలసల వల్ల స్థానిక శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వలసలకు కొమ్ముకాస్తున్న విపక్షాల కుటిల రాజకీయాలను తుదముట్టించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు.

అక్ర‌మ వ‌ల‌స దారుల‌కు అజ‌య్ ఖాన్ అండ‌

ఖమ్మం జిల్లా ప్రస్తుతం అక్రమ వలసదారులకు అడ్డాగా మారుతోందని, గత మంత్రులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రోహింగ్యాలకు ఆధార్‌, రేషన్‌ కార్డులు ఇప్పించి దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అజయ్ కుమార్‌ను ‘అజయ్ ఖాన్’గా సంబోధిస్తూ, అక్రమ వలసదారులకు ఆయన పూర్తి మద్దతు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే దేశద్రోహ శక్తులకు కొమ్ముకాస్తున్నాయని, దీనివల్ల జిల్లాలో స్లీపర్‌ సెల్స్‌ కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీరును తప్పుబడుతూ, కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ అనేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో రోహింగ్యాలను తరిమికొట్టిన తరహాలోనే, తెలంగాణలోనూ బీజేపీ అక్రమ వలసలను అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తోందని నేతలు ఉద్ఘాటించారు.

ప్ర‌ధాని స‌భ‌కు త‌ర‌లి రావాలి..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను చారిత్రాత్మక విజయవంతం చేయాలని, అక్రమ వలసలకు కొమ్ముకాస్తున్న విపక్షాల కుటిల రాజకీయాలను తుదముట్టించాలని నెల్లూరి కోటేశ్వరరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయిల వెంకట్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ గడ్డపైకి వస్తున్నారని, ఈ నెల 10వ తేదీ ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని అభివర్ణించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ చారిత్రాత్మక సభకు ఖమ్మం జిల్లా నుంచి దళిత సోదరులు, జాతీయవాదులు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్‌ సభకు వెళ్లే ప్రజల కోసం జిల్లా నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని నేతలు వెల్లడించారు. ఎర్రుపాలెం నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని, ఈ రైలు ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఖమ్మం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. రైతులు, మహిళలు, యువత అధిక సంఖ్యలో తరలివచ్చి మోదీకి ఘనస్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు. దేశ రక్షణ, అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ సభలో పాల్గొని మోదీకి అండగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు సన్నీ ఉదయ్‌ ప్రతాప్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు కోటమర్తి సుదర్శన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్, సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, మేకల నాగేందర్ , రజనీ రెడ్డి, మంద సరస్వతి , నక్కల రవి గౌడ్,శ్రీరామనేని మణి, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.