వైభవంగా కట్ట మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన
కోనారెడ్డి చెరువు కట్టపై ఆధ్యాత్మిక శోభ
అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర ఖాదీ బోర్డు మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వర్ధన్నపేట మండల కేంద్ర శివారులోని కోనారెడ్డి చెరువు కట్టపై నూతనంగా నిర్మించిన కట్ట మైసమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం ఆధ్యాత్మిక ఉత్సాహంతో, అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై, శాస్త్రోక్తంగా జరిగిన ప్రతిష్టాపన పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఈగ మల్లేశం మాట్లాడుతూ.. కట్ట మైసమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, పాడిపంటలు బాగుండి అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. కోనారెడ్డి చెరువు కట్టపై ఎంతో శ్రమించి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆలయ ఆవిర్భావంతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, కౌన్సిలర్ సిలివేరు కుమార స్వామి, తుమ్మల యాకయ్య, అబ్బు ప్రకాష్ రెడ్డి, మార్త సారంగపాణి, పూజారి రఘు, కోనాపురం యాకయ్య, తుమ్మల రవీందర్, సమ్మెట శ్రీనివాస్, నందిపాక భాస్కర్, వేణు, పాలకుర్తి శ్రీకాంత్, కోనాపురం ముత్తయ్యలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

