ప్రధాని సభకు తరలిన మడికొండ బీజేపీ శ్రేణులు
జెండా ఊపి ప్రారంభించిన నాయకుడు పెట్టం సాంబయ్య
కాకతీయ, హనుమకొండ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు హనుమకొండ జిల్లా నుంచి బీజేపీ శ్రేణులు కదిలాయి. జిల్లాలోని మడికొండ చౌరస్తా వద్ద సభకు వెళ్లే వాహన శ్రేణిని సీనియర్ బీజేపీ నాయకుడు పెట్టం సాంబయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తల “జై మోదీ.. జైజై మోదీ” నినాదాలతో మడికొండ పరిసరాలు మార్మోగాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. “దేశం కోసం మోదీ, మోదీ కోసం మనం” అనే సంకల్పంతో వికసిత భారత్ నిర్మాణంలో తెలంగాణను భాగస్వామ్యం చేసేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా తరలివెళ్తున్నారని తెలిపారు. దేశ అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాల అమలులో ప్రధాని మోదీ నాయకత్వం ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. తెలంగాణపై ప్రధాని చూపిస్తున్న ప్రత్యేక అభిమానానికి కృతజ్ఞతగా ఈ సభను అఖండంగా విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఉత్సాహంగా తరలిన శ్రేణులు
ఈ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ జిల్లా కార్యదర్శి పోనగోటి వెంకట్ రావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం మహేందర్, జిల్లా ఉపాధ్యక్షులు బైరి శ్రావణ్, రామిండ్ల బాబురావు, చట్ల అజయ్, బరిగల పినోకర్ బాబు పాల్గొన్నారు. అలాగే తాడేం రంజిత్, మాచర్ల రంజిత్, పల్లకొండ రాజేందర్, బైరి సతీష్, వస్కుల భాస్కర్, అఖిల్ తదితరులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి సికింద్రాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. వాహనాలపై బీజేపీ జెండాలు కట్టి, డప్పు చప్పుళ్లతో కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా తరలివెళ్లడం కనిపించింది.

