epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తూర్పార యంత్రంలో చిక్కుకొని మహిళా కూలి మృతి

తూర్పార యంత్రంలో చిక్కుకొని మహిళా కూలి మృతి

కాశేగుడిసెలు గ్రామంలో మిన్నంటిన రోదనలు..

కాకతీయ, చేర్యాల : వరి ధాన్యం తూర్పార పట్టే యంత్రం రూపంలో ఒక నిరుపేద మహిళను మృత్యువు కబళించింది. యంత్రంలో తల వెంట్రుకలు చిక్కుకొని తీవ్ర గాయాలతో మహిళా కూలి అక్కడికక్కడే మృతి చెందిన హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కాశేగుడిసెలు గ్రామంలో సోమవారం ఉద‌యం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల మండలం కాశేగుడిశేలు గ్రామానికి చెందిన షేక్ ఇమాంబి (50) వ్యవసాయ కూలిగా జీవనం సాగిస్తోంది. సోమవారం కూలి పనిలో భాగంగా కాశేగుడిసెలు గ్రామంలో  వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద తూర్పార పట్టే యంత్రం వద్ద పనిచేస్తోంది. ఈ క్రమంలో యంత్రంలో వడ్లు పోస్తుండగా, ప్రమాదవశాత్తూ ఆమె తల వెంట్రుకలు తిరుగుతున్న యంత్రం బెల్టులో చిక్కుకున్నాయి. క్షణాల్లో ఆమె తల యంత్రంలోకి వెళ్ల‌డంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయింది.

తీరని పుత్రశోకం.. అంతలోనే ఇలా

మృతురాలు ఇమాంబి కుటుంబం అత్యంత పేదరికంలో ఉంది. ఆమెకు నలుగురు కుమార్తెలు కాగా, ఉన్న ఒక్కగానొక కుమారుడు కూడా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. పుత్రశోకంతో కుమిలిపోతున్న ఆమె, కుటుంబ భారాన్ని మోస్తూ కూలి పనులకు వెళ్తోంది. ఇంతలోనే ఇమాంబి కూడా మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైపోయింది. తల్లి మరణవార్త విన్న కుమార్తెలు, బంధువులు ఘటనా స్థలంలో చేసిన రోదనలు స్థానికుల కళ్లు చెమ్మగిల్లేలా చేశాయి. ప్రమాద సమాచారం అందుకున్న చేర్యాల ఎస్సై జి. అపూర్వరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త షేక్ సుభాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రైతులు, కూలీలు యంత్రాల వద్ద పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఇమాంబి మృతితో ఆ ఇల్లు చీకటిమయమైందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తిని కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, ఆమె కుమార్తెల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని పలువురు గ్రామస్థులు, రైతులు విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.