హనుమాన్ మాలధారులకు పండ్లు వితరణ చేసిన ముస్లిం సోదరులు
కాకతీయ, చేర్యాల: కులం, మతం అనే తారతమ్యం లేకుండా ముస్లింలు అన్ని వర్గాలకు ఇతోధికంగా సహయం అందిస్తూ అందరి చేత శభాష్ అని ప్రశంసలు అందుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూర్ గ్రామనికి చెందిన సామాజిక కార్యకర్తలు, ఎండి జహంగీర్,ఎండి ఫయాజ్, ఎండి హైమత్ లు కలిసి ఆకునూర్ గ్రామంలో హనుమాన్ మాలధారణ స్వాములకు వారు స్వయంగా పండ్లు, ఫలహారాలు వితరణ చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఎలాంటి మతపరమైన విభేదాలు లేకుండా, భక్తితో స్వాములకు పండ్లు,ఫలహారాలు అందించిన ముస్లిం సోదరుల తీరును స్థానికులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. సమాజంలో మత సామరస్యం వెల్లివిరియడానికి ఇలాంటి ఘటనలు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ఈ వార్త ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమైంది.

