epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మణుగూరులో క‌ల్తీ మాంసం

మణుగూరులో క‌ల్తీ మాంసం
ప్రజల ఆరోగ్యంతో వ్యాపారుల ఆట‌లు
అనారోగ్యంతో ఉన్న‌ జీవాల మాంసం విక్రయం
ప్రభుత్వ ముద్ర లేకుండానే సాగిపోతున్న అమ్మ‌కాలు
పట్టించుకోని మున్సిపాలిటీ, పశుసంవర్ధక శాఖ అధికారులు
కల్తీ మాంసంతో రోగాల బారిన పడుతున్న సామాన్య జనం
కాకతీయ, మణుగూరు : మణుగూరు పట్టణంలో మేక మాంసం కల్తీ విచ్చలవిడిగా సాగుతోంది. అమాయక ప్రజల ఆరోగ్యంతో వ్యాపారులు చెలగాటమాడుతుంటే, నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోగాల బారిన పడ్డ జీవాల మాంసాన్ని జోరుగా విక్రయం చేస్తున్నారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న మేకలు, గొర్రెలను మాత్రమే వధించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది వ్యాపారులు తక్కువ ధరకే మేకలు వస్తున్నాయని గమనించి, రోగాల బారిన పడిన జీవాలను, చనిపోయే దశలో ఉన్న వాటిని కొనుగోలు చేసి ఆ మాంసాన్ని మార్కెట్ లో విక్రయిస్తున్నారని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల మేక మాంసంలో ఇతర తక్కువ రకం మాంసాలను కలపడం, బరువు పెరగడానికి మాంసంలో రసాయనాలు, నీరు చేర్చడం వంటి అక్రమాలకు పాల్పడటం సంచలనం రేపుతోంది.
గతంలో గురుకుల పాఠశాల 24 విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైన ఫోటోలు…
మ‌ణుగూరులో మాంసం వ్యాపారి దుకాణం ఆవ‌ర‌ణ‌లోఅనారోగ్యంతో ఉన్న మేక‌లు
కల్తీ మాంసం వల్ల జబ్బుల పాలు
ఈ కల్తీ మాంసాన్ని తినడం వల్ల ప్రజలు గ్యాస్ట్రిక్, విరోచనాలు, అన్నం వికటించడం వంటి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఉదాహరణకు గత కొన్ని రోజుల క్రితం మణుగూరులోని ఒక వసతి గృహం విద్యార్థులకు అన్నం వికటించి, అనేక మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన విషయం మణుగూరు ప్రజానీకానికి అంతా తెలిసిందే. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజానీకం గగ్గోలు పెడుతున్నారు. నిజానికి మార్కెట్లోకి వచ్చే మాంసం నాణ్యతను పరీక్షించడానికి మున్సిపల్, పశుసంవర్ధక, ఆహార భద్రతా విభాగాలు ఉన్నాయి. జీవాలను వధించే ముందే అవి ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని పశువైద్యులు ధృవీకరించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు.
తనిఖీలు లేవు.. అడ్డుఅదుపూ లేదు
అధికారులు కనీసం మాంసం దుకాణాలను తనిఖీ చేసిన దాఖలాలు ఎక్కడా లేకపోవడం గమనార్హం. అంతా సాపీగానే ఉందని అధికారులు ఉండటంతో కల్తీ వ్యాపారులకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. మాంసం నాణ్యతపై గతంలో పలువురు ఫిర్యాదులు చేసినా అధికారులు మొద్దునిద్ర వీడకపోవడం వెనుక పెద్ద ఎత్తున మామూళ్ల వ్యవహారం నడుస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్న వ్యాపారులపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ప్రత్యేక బృందాలతో మాంసం మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని మణుగూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లైసెన్స్ లేని దుకాణాలపై చర్యలు తీసుకోవాలని, కల్తీ మాంసం విక్రయించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు ధృవీకరించిన మాంసం లభించేలా చూసి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఎంతైనా ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.