epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రభుత్వ బడిలో ‘ప్రైవేట్’ దందా!

ప్రభుత్వ బడిలో ‘ప్రైవేట్’ దందా!
టీసీలు ఇచ్చే వేళ డొనేషన్ పేరిట అక్రమ వసూళ్లు
ఒక్కో విద్యార్థి నుంచి రూ. 300 – 500 గుంజుతున్న సిబ్బంది
సర్కార్ బడిలో అడ్డగోలు దోపిడీ.. నిమ్మకు నీరెత్తినట్లు విద్యాశాఖ అధికారులు!
బలవంతం లేదంటున్న హెచ్ఎం.. వసూళ్లు సబబేనంటూ ఎంఈవో వింత సమర్థన!
డబ్బులు ఇస్తేనే టీసీలు ఇస్తున్నారంటూ విద్యార్థుల ఆవేదన

కాకతీయ, గంభీరావుపేట : ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సింది పోయి.. అక్కడే ప్రైవేట్ దందాను నడిపిస్తున్నారు కొందరు అధికారులు, సిబ్బంది. పదవ తరగతి పూర్తి చేసుకుని పైచదువుల కోసం వెళ్లే విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ) ఇచ్చే వేళ అడ్డగోలుగా కాసులు దండుకుంటున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రతిష్టాత్మక కేజీ టు పీజీ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్కూల్ అభివృద్ధికై ‘డొనేషన్’ ఇస్తేనే టీసీలు ఇస్తామంటూ ఒక్కో విద్యార్థి నుంచి రూ. 300 వరకు వసూలు చేస్తున్నారు. ఉచితంగా విద్యనందించాల్సిన సర్కార్ స్కూల్లో ఈ వసూళ్లు ఏంటని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తే.. ఇక్కడ సిబ్బంది చెబుతున్న సమాధానాలు విని షాక్‌కు గురవడం బాధితుల వంతవుతోంది.

ఇదేం కొత్త కాదు.. అంతటా ఇంతేనట..!

“ఇక్కడ రూ. 300 వసూలు చేయడం ఇదేం కొత్త కాదు.. గత చాలా సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతోంది. మేమైతే కేవలం 300 తోనే సరిపెడుతున్నాం.. మండలంలోని మిగతా ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 500 వరకు గుంజుతున్నారు” అంటూ టీసీలు ఇస్తున్న ఓ అటెండర్ క్షేత్రస్థాయిలో వ్యాఖ్యానించడం ఇక్కడి దోపిడీ తీవ్రతకు అద్దం పడుతోంది. స్కూల్లో స్కావెంజర్లను ప్రైవేటుగా నియమించామని, వారికి ఇవ్వాల్సిన జీతభత్యాలను కూడా విద్యార్థుల నుంచే వసూలు చేస్తున్నామని సిబ్బంది బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. పాఠశాలల్లో నిర్వహించే జెండా పండుగలు, తాగునీటి సౌకర్యం, శానిటేషన్ అవసరాలకు ప్రభుత్వ నిధులు సమయానికి అందడం లేదని, అందినప్పటికీ అవి అరకొరగానే ఉంటున్నాయని.. అందుకే విద్యార్థుల జేబులకు చిల్లు పెడుతున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు సిబ్బంది రిపోర్టర్ ముందు వాపోయారు.

ఇష్టపూర్వకంగా ఇస్తున్నారట.. అధికారుల వింత సమర్థన!

ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఫోన్ ద్వారా రిపోర్టర్ వివరణ కోరగా.. ఆయన బుకాయించే ప్రయత్నం చేశారు. తాము ఎవరి వద్ద బలవంతంగా తీసుకోవడం లేదని, విద్యార్థులే ఇష్టపూర్వకంగా ఇస్తుంటే తీసుకుని స్కూల్ అభివృద్ధికి వాడుతున్నామని చెప్పుకొచ్చారు. అయితే, ఇదే విషయమై గంభీరావుపేట మండల విద్యాధికారి (ఎంఈవో) గంగారాంను వివరణ కోరగా.. ఆయన అంతకంటే వింత సమాధానం ఇచ్చారు. టీసీ బుక్కుల ముద్రణకు అవుతున్న ఖర్చులు తామే భరిస్తున్నామని, అందుకోసం విద్యార్థుల నుండి రూ. 100 వరకు తీసుకోవడం సబబేనంటూ అక్రమ వసూళ్లకు అధికారిక ముద్ర వేసే ప్రయత్నం చేయడం గమనార్హం. అధికారులు ఏవేవో కారణాలు చెప్తున్నప్పటికీ.. తాము కచ్చితంగా రూ. 300 చెల్లిస్తేనే చేతిలో టీసీ పెడుతున్నారని, లేదంటే తిప్పించుకుంటున్నారని విద్యార్థులు లబోదిబోమనడం ఇక్కడి అసలు నిజాలను బయటపెడుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.