epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అభివృద్ధి బాటలో ముదిగొండ

అభివృద్ధి బాటలో ముదిగొండ
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సర్కారు ప్రాధాన్యం
కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు
రవాణా వ్యవస్థ బలోపేతానికి 33 కోట్ల భారీ ప్రాజెక్టు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

కాక‌తీయ‌, ముదిగొండ : “గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే నా లక్ష్యం. ప్రజలకు మెరుగైన పాలనను, సౌకర్యాలను చేరువ చేయడమే ప్రభుత్వ ధ్యేయం” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎడవల్లి లక్ష్మీపురంలో 20 లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ భవనంతో ప్రజలకు పరిపాలనా సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయని భరోసా ఇచ్చారు.

విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
“ముదిగొండ మండలంలోని ఎడవల్లిలో రైతులకు, గృహ, వాణిజ్య అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు 3.15 కోట్ల రూపాయల వ్యయంతో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశాం. దీనివల్ల విద్యుత్ కోతలు తగ్గి, సాగుకు ఇబ్బందులు ఉండవు. అలాగే మండల కేంద్రంలో 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఈఆర్వో కార్యాలయానికి భూమిపూజ నిర్వహించాం. ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే అధికారుల పర్యవేక్షణ పెరిగి, ప్రభుత్వ సేవలు మరింత వేగవంతం అవుతాయి” అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

రవాణా వ్యవస్థకు కొత్త ఊపిరి
“ముదిగొండ అభివృద్ధిలో భాగంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎడవల్లి-తల్లంపాడు రహదారి విస్తరణతో పాటు ఎడవల్లి-లక్ష్మీపురం మీదుగా తెల్దారుపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాం. ముఖ్యంగా కోదాడ-ఖమ్మం-కురివి, సూర్యాపేట-అశ్వారావుపేట జాతీయ రహదారులను అనుసంధానించే 33 కోట్ల భారీ ప్రాజెక్టు పనులకు భూమిపూజ చేశాం. ఇది ముదిగొండ రవాణా వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు సులభతరమై, పారిశ్రామికంగా ముదిగొండ అభివృద్ధి చెందుతుంది. పనుల్లో నాణ్యత విషయంలో అధికారులు రాజీ పడొద్దని, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించాను” అని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ముదిగొండ మండల కేంద్రంలో 50 పడకలతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. నిర్మాణ నాణ్యతను తనిఖీ చేసి, పేదలకు మెరుగైన వైద్యం అందేలా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.