epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అధికారులు మేల్కొనేందుకు ప్రాణనష్టం జరగాలా..?

అధికారులు మేల్కొనేందుకు ప్రాణనష్టం జరగాలా..?
మానాల గ్రామంలో కూలిపోనున్న విద్యుత్ స్తంభాలు
కథనాలు, ఫిర్యాదులకూ కదలని యంత్రాంగం
వర్షాకాలం ముందు గ్రామస్తుల్లో పెరుగుతున్న ఆందోళన

కాకతీయ, వేములవాడ : ప్రమాదం కళ్లముందే కనిపిస్తున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుద్రంగి మండలం మానాల గ్రామంలో ప్రమాదకర స్థితికి చేరుకున్న విద్యుత్ స్తంభాలు ఎప్పుడు కూలిపోతాయోనన్న భయాందోళనల మధ్య గ్రామస్తులు గడుపుతున్నారు. అయినప్పటికీ సంబంధిత శాఖల నుంచి స్పందన లేకపోవడం తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. మానాల–రుద్రంగి ప్రధాన రహదారిపై పలుచోట్ల విద్యుత్ స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా నిలిచాయి. ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది మంది రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు ప్రయాణిస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలోని పలు వీధుల్లో కూడా విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని స్తంభాలు నేలకు ఒరిగిపోగా, మరికొన్ని స్వల్ప గాలికే కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇవి ఎప్పుడు ప్రజలపై లేదా ఇళ్లపై పడతాయోనన్న భయంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

కథనాలు వచ్చాయి… ఫిర్యాదులు చేశారు… స్పందన మాత్రం లేదు

ఈ సమస్యపై గతంలోనే కాకతీయ ప్రత్యేక కథనాలు ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. గ్రామస్తులు సైతం పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. స్థానిక ఏఈ కృష్ణకాంత్‌కు కూడా సమస్యను వివరించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క స్తంభాన్ని కూడా మార్చలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశముంది. ఈదురుగాలులు, భారీ వర్షాల సమయంలో బలహీనంగా ఉన్న విద్యుత్ స్తంభాలు కూలిపోతే తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. రహదారిపై ప్రయాణిస్తున్న వారిపై లేదా సమీప ఇళ్లపై స్తంభాలు కూలిపోతే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

ప్రాణాలు పోయాక స్పందిస్తారా..?

“స్తంభాలు వంగిపోయి ప్రమాద సంకేతాలు ఇస్తున్నాయి… పరిస్థితి అందరికీ కనిపిస్తోంది… అయినా అధికారులు ఎందుకు స్పందించడం లేదు..? ప్రాణనష్టం జరిగిన తర్వాతే చర్యలు తీసుకుంటారా..?” అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని, వర్షాకాలానికి ముందే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే స్పందిస్తారా..? లేక ప్రమాదం జరిగిన తర్వాత విచారణలకే పరిమితమవుతారా..? అనే ప్రశ్నకు విద్యుత్ శాఖ అధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.