బీఆర్ఎస్‌కు రామడుగులో ఎదురుదెబ్బ
కాంగ్రెస్ గూటికి సర్పంచ్ సహా కీలక నేతలు
కాకతీయ, రామడుగు: చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు గ్రామపంచాయతీలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సర్పంచ్ మహమ్మద్ మోయీజ్, ఉపసర్పంచ్ పెందోట రాజ్‌కుమార్, ఏడుగురు వార్డు సభ్యులు, 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, గృహజ్యోతి వంటి సంక్షేమ పథకాలు తమను ఆకర్షించాయని సర్పంచ్, ఉపసర్పంచ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నాయకత్వంలో గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్న నమ్మకంతోనే తాము కాంగ్రెస్‌లో చేరామని తెలిపారు. రామడుగు అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

