epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వొడిత‌ల వ‌ర్సెస్ పాడి

వొడిత‌ల వ‌ర్సెస్ పాడి
ఇల్లందకుంటలో ‘క్రెడిట్’ వార్..
తహశీల్దార్ కార్యాలయ భ‌వ‌నం మంజూరుపై నేత‌ల మ‌ధ్య క్రెడిట్ వార్‌
సొంత కృషి అంటూ ఎమ్మెల్యే ప్రకటన..
ప్రభుత్వ నిర్ణయమేనంటూ కాంగ్రెస్ నియోజ‌క‌ర్గ‌ ఇన్‌చార్జి కౌంటర్

కాక‌తీయ‌, హుజూరాబాద్ : ఇల్లందకుంట మండల కేంద్రంలో కొత్త తహశీల్దార్ కార్యాలయ భవనం మంజూరు కావడం స్థానికంగా అభివృద్ధికి బాటలు వేసినా, రాజకీయంగా మాత్రం రగడ మొదలైంది. ఈ భవన మంజూరు తమ చొరవ వల్లే జరిగిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ వేర్వేరుగా ప్రకటనలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఇల్లందకుంటలో కొత్త తహశీల్దార్ కార్యాలయం అవసరాన్ని తాను ప్రభుత్వ స్థాయిలో గట్టిగా వినిపించానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు, జిల్లాకు చెందిన ఇతర మంత్రులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశానని, అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించానని ఆయన గుర్తు చేశారు. తన పట్టుదల, నిరంతర కృషి వల్లే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, దీనివల్ల రెవెన్యూ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని కౌశిక్ రెడ్డి వివరించారు.

వొడితల ప్రణవ్ ఖండ‌న‌..!

ఎమ్మెల్యే వాదనను కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి వేగవంతమైందని, ఇల్లందకుంట భవన మంజూరు కూడా అదే కోవలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మంత్రుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడం ద్వారానే నిధులు మంజూరయ్యాయని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏమీ చేయని వారు ఇప్పుడు క్రెడిట్ కోసం పాకులాడటం సరికాదని ప్రణవ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. హుజూరాబాద్‌లో అభివృద్ధి పనుల విషయంలో క్రెడిట్ రాజకీయాలు కొత్తేమీ కాదని, గతంలోనూ పలు పనుల విషయంలో ఇరువర్గాల మధ్య ఇలాంటి వాదోపవాదాలే జరిగాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న ఈ పోటాపోటీ ప్రకటనల వల్ల క్షేత్రస్థాయిలో పనులు సకాలంలో పూర్తవుతాయా లేదా అన్నదే ఇప్పుడు ప్రజల్లో ఉన్న ప్రధాన సందేహం. ఏది ఏమైనా, రాజకీయ పోరు పక్కన పెట్టి, భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.