epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రిజిస్ట్రేషన్ల‌లో గందరగోళం

రిజిస్ట్రేషన్ల‌లో గందరగోళం
జూనియర్ అసిస్టెంట్లతో రిజిస్ట్రేషన్లు
చెల్లుబాటుపై చ‌ట్ట‌ప‌ర‌మైన చిక్కులు?!
కోర్టు హెచ్చరికలున్నా శాఖ‌లో రాని మార్పు
ఉన్న‌తాధికారుల ఒత్తిడితో జూనియ‌ర్ అసిస్టెంట్ల స‌త‌మ‌తం
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో పోస్టులు ఖాళీ
అదనపు బాధ్యతలతో నలిగిపోతున్న సిబ్బంది.. భయాందోళనల్లో ప్రజలు
ఆదాయంపైనే ప్రభుత్వ ఫోకస్.. ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యం

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : రాష్ట్ర ఖజానాకు సింహభాగం ఆదాయాన్ని సమకూర్చే రిజిస్ట్రేషన్ శాఖ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అస్తవ్యస్తంగా తయారైంది. సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ అధికారిక హోదా లేని జూనియర్ అసిస్టెంట్లతో రిజిస్ట్రేషన్లు చేయించడం ఇప్పుడు శాఖలో పెద్ద చర్చకు, చట్టపరమైన వివాదాలకు దారితీస్తోంది. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడంపై చూపుతున్న శ్రద్ధ, ఆ శాఖను నడిపించే సిబ్బంది నియామకాలపై మాత్రం చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియకు చట్టబద్ధమైన బాధ్యత. పత్రాల పరిశీలన, పక్షాల గుర్తింపు, స్టాంప్ డ్యూటీ నిర్ధారణ వంటి కీలకమైన బాధ్యతలను నిర్వహించే అధికారం చట్టం కేవలం సబ్ రిజిస్ట్రార్లకు మాత్రమే కల్పించింది. కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో, జూనియర్ అసిస్టెంట్లతో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. గతంలో ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో జూనియర్ అసిస్టెంట్ చేసిన రిజిస్ట్రేషన్ చట్టబద్ధతను న్యాయస్థానం ప్రశ్నించినప్పటికీ, ఉన్నతాధికారులు మాత్రం అదే విధానాన్ని కొనసాగిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో ఈ పత్రాలు కోర్టుకు చేరితే, ఆ రిజిస్ట్రేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని, తద్వారా లక్షలాది రూపాయల విలువైన ఆస్తుల చట్టబద్ధత ప్రశ్నార్థకంగా మారుతుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సిబ్బంది కొరత.. నిత్యం నరకం
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని అనేక కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల ప్రజలు గంటల తరబడి కార్యాలయాల ఎదుట వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన కార్యాలయం, నేటికీ పూర్తిస్థాయి సిబ్బంది లేక ఒక జూనియర్ అసిస్టెంట్‌తోనే నెట్టుకొస్తోంది. పరిపాలనా అవసరాల దృష్ట్యా జిల్లా స్థాయి అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చి పనులు చేయిస్తున్నామని చెబుతున్నా, ఆ ప్రొసీడింగ్స్‌కు చట్టబద్ధమైన బలం ఎంత అనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు. పై అధికారుల ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటారని, చేస్తే భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని జూనియర్ అసిస్టెంట్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రమోషన్లు లేక, అదనపు బాధ్యతలు మోస్తూ, పైగా చట్టపరమైన చిక్కుల మధ్య వారు నలిగిపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్నా ప్రమోషన్లు ఇవ్వకపోవడం పట్ల వారు తీవ్ర అసహనంతో ఉన్నారు.

కొత్త డీఆర్ ముందున్న సవాళ్లు
వరంగల్ జిల్లా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టనున్న కొత్త అధికారి ముందు అనేక సమస్యలు కొండలా పేరుకుపోయాయి. ఖాళీ పోస్టుల భర్తీ, జూనియర్ అసిస్టెంట్లతో రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై చట్టపరమైన స్పష్టత, పెండింగ్ ప్రమోషన్ల పరిష్కారం వంటి అంశాలపై కొత్త డీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఖజానాను నింపుతున్న ఈ శాఖ పట్ల ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఖాళీలను భర్తీ చేయాలని, చట్టపరమైన చిక్కులు రాకుండా పరిపాలనా సంస్కరణలు చేపట్టాలని ప్రజలు, ఉద్యోగులు కోరుతున్నారు. లేనిపక్షంలో, ఈ పరిపాలనా లోపం భవిష్యత్తులో వేలాది ఆస్తుల యజమానులకు శాపంగా మారే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.