epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉద్యమకారుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

ఉద్యమకారుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
మేనిఫెస్టో హామీలను అమలు చేయడంలో జాప్యం
కేశ‌వరావు కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన
తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల రవికుమార్
ఆగస్టు నుంచి ‘ఉద్యమకారుల ఓదార్పు యాత్ర’కు పిలుపు
ఉద్యమకారుల సంక్షేమానికి కోసం ఐక్య వేదిక ఐదు డిమాండ్లు

కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాల పాటు వేలాది మంది ఉద్యమకారులు పోరాడారని, ఎంతోమంది అమరులయ్యారని, మరికొందరు జైలు పాలయ్యారని, సర్వస్వాన్ని కోల్పోయారని, అలాంటి త్యాగధనులను గుర్తించి గౌరవించాల్సింది పోయి నేడు పాలకులు వారిని నిర్లక్ష్యం చేయడం చాలా నీచమైన చర్య అని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ ధ్వజమెత్తారు. హనుమకొండలోని కాకతీయ కాలనీలో జరిగిన ఉద్యమకారుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమకారుల శ్రమతోనే ఏర్పడిందని రవికుమార్ గుర్తు చేస్తూ, ఉద్యమకారుల శ్రమతో ఏర్పడిన ప్రభుత్వం వారిని ఆదరించకపోవడం దురదృష్టకరమని, మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 240 గజాల స్థలం, 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచినా అమలు చేయకపోవడం మోసపూరిత వైఖరి అని ఆయన మండిపడ్డారు. ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే గతంలో 30 ఏళ్లు కొనసాగాల్సిన పాలనను ఒక ప్రభుత్వం 9 ఏళ్లలోనే కోల్పోయిందని ఆయన హెచ్చరించారు.

హామీల అమలులో జాప్యంపై హెచ్చరిక
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేషవరావు కమిటీని స్వాగతిస్తున్నామని చెబుతూనే, ఆ పేరుతో కాలయాపన చేస్తే ఊరుకునేది లేదని రవికుమార్ స్పష్టం చేశారు. కమిటీల పేరుతో సమయం వృథా చేస్తే 5 ఏళ్లు కూడా అధికారంలో ఉండలేరని ఆయన హెచ్చరించారు. ఉద్యమంలో సర్వస్వాన్ని కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ఉద్యమకారులను ఆదుకోవడానికి, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఆగస్టు నెల నుండి ‘ఉద్యమకారుల ఓదార్పు యాత్ర’ చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు.

ఐక్య వేదిక ప్రధాన డిమాండ్లు
ఈ సమావేశంలో ఐక్య వేదిక ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం కేటాయించాలని, రూ.10 ల‌క్ష‌ల‌ ఆర్థిక ఉద్దీపన అందించాలని, నెలకు 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ఉద్యమకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో సంక్షేమ భవనాలను నిర్మించాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు ఆమోదించింది. ఈ సమావేశంలో తొలి దశలో పోరాడిన 10 మంది ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సందేశ సునీల్, యండి. చాంద్ పాషా, బోళికెట్టి అశోక్, అనుమల రమేష్, చెన్నూరి నటరాజ్, మనోహర్ రావు, మొగసాల దేవేందర్ రెడ్డి, మీర్జా అంజద్, రామ్ కుమార్, మెలుంగారి నెల్సన్ గోపన్న, బోయిన రాజు, బరిగాల కృష్ణ మూర్తి, ఇమాడిశెట్టి రాజు, ఖదీర్, స్వర్ణ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.