epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీనియర్లకు ప్రాధాన్యం లేదంటూ కాంగ్రెస్‌కు రాజీనామా

సీనియర్లకు ప్రాధాన్యం లేదంటూ కాంగ్రెస్‌కు రాజీనామా
బీఆర్ ఎస్‌లో చేరిన చిన్నబోయినపల్లి, మొద్దుల వెంకటాపురం నాయ‌కులు
లక్ష్మణ్ బాబు సమక్షంలో గులాబీ కండువా క‌ప్పుకున్న నేత‌లు

కాక‌తీయ‌, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి, మొద్దుల వెంకటాపురం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం బీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంటా తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో పలువురు పార్టీకి రాజీనామా చేసి ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకుని బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా గంటా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన కొందరు నాయకులకే ప్రాధాన్యం పెరిగిందని, దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులను పూర్తిగా పక్కనబెట్టారని ఆరోపించారు. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేకుండా కొందరి సూచనల మేరకే పార్టీ వ్యవహారాలు సాగుతున్నాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని, గ్రామాల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ కారణాల వల్లే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై, ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ప్రజల కోసం చేస్తున్న కృషిపై విశ్వాసంతో తాము బీఆర్ఎస్‌లో చేరినట్లు పేర్కొన్నారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ.. సీనియర్ నాయకులను గౌరవించలేని కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేర్చగలదని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో చేరిన నాయకులు, కార్యకర్తలకు పార్టీలో సముచిత ప్రాధాన్యం, బాధ్యతలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నబోయినపల్లి, మొద్దుల వెంకటాపురం గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువజన ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.