రోడ్ల అభివృద్ధికి రూ.122 కోట్ల వరం
రుద్రంగి మండలంలో కాంగ్రెస్ నాయకుల హర్షం
కాకతీయ, రుద్రంగి : వేములవాడ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.122 కోట్లు మంజూరు చేయడాన్ని మండల కాంగ్రెస్ శ్రేణులు స్వాగతించాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాలకు తలా రూ.2 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తాజాగా రోడ్ల కోసం భారీగా నిధులు మంజూరు చేయడంపై సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్యలు హర్షం వ్యక్తం చేశారు. ప్రాధాన్యత లేని పాత పనులను పక్కనబెట్టి, నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

