epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాల్వను మింగేసిన ‘ఎర్ర’ సూర్యుడు!

  • ఎన్ఎస్పీ కాలువపై అక్రమ నిర్మాణం..
  • కామ్రేడ్ ముసుగులో కబ్జాపర్వం!
  • అధికారులను ప్రభావితం చేస్తూ ఆక్రమణను కప్పిపుచ్చే యత్నం
  • ఏదులాపురం పరిధిలో కాలువ స్థలాన్ని ఆక్రమించి భారీ నిర్మాణం
  • గతంలోనూ వివాదాస్పద వ్యవహారాలతో వార్తల్లో సదరు నాయకుడు
  • ఆధారాలతో కలెక్టర్‌ను ఆశ్రయించేందుకు స్థానికులు స‌న్న‌ద్ధం

కాక‌తీయ‌, ఖమ్మం రూరల్ : పేదల కోసం త్యాగాలు చేస్తామని ప్రగల్భాలు పలికే ఓ మాజీ ప్రజా ప్రతినిధి.. తెర వెనుక మాత్రం ప్రభుత్వ ఆస్తులను మింగేస్తున్న ఉదంతం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది. ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు ఆటోనగర్‌లో ఎన్ఎస్పీ కాలువ భూమిని ఒక మాజీ నాయకుడు తన రాజకీయ హోదాను అడ్డుపెట్టుకుని ఆక్రమించి, అక్రమంగా నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ‘ఎర్ర చొక్కా’ వేసుకున్నంత మాత్రాన కామ్రేడ్ అయిపోరని, ప్రజా సేవకులను ఆదర్శంగా తీసుకోవాల్సింది పోయి, ప్రజలకు అందాల్సిన సాగునీటి మార్గాన్ని కబ్జా చేయడం ఏమిటని స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఈ అక్రమ నిర్మాణం గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇరిగేషన్ శాఖకు చెందిన ఓ చోటా అధికారి, సదరు నాయకుడికి బంధువు కావడంతో, కబ్జాను కప్పిపుచ్చేలా ఆయనే చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తూ, అధికారులు ఆ నాయకుడికి వత్తాసు పలుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ మహిళా అధికారిపై అనుచితంగా ప్రవర్తించి చట్టపరమైన చిక్కుల్లో పడిన సదరు నాయకుడు, ఇప్పుడు మళ్ళీ కాలువను ఆక్రమించి అక్రమాలకు పాల్పడటం గమనార్హం.

సాగునీటి కష్టాలు.. ఆక్రమణకు గురైన 312 సర్వే నంబర్
గోళ్లగూడెం వద్ద మొదలై ఆటోనగర్, వరంగల్ క్రాస్ రోడ్డు, పెద్దతండ మీదుగా గుర్రాలపాడు వరకు సుమారు వెయ్యి ఎకరాల సాగు భూములకు నీరందించే ఈ ఎన్ఎస్పీ కాలువ, ఇప్పుడు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఏదులాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నం. 312లో ఉన్న ఈ భూమిని గతంలోనే ప్రభుత్వం భూ సేకరణ చేసి నష్టపరిహారం చెల్లించింది. అటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇప్పుడు నిర్మాణం చేపట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి మార్గాన్ని మూసివేస్తే భవిష్యత్తులో వ్యవసాయం ఎలా సాగుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.

కలెక్టర్‌ను ఆశ్రయించేందుకు సిద్ధం
ఈ అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని, కాలువను పునరుద్ధరించాలని కోరుతూ స్థానికులు ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన బాధితులు, సాక్ష్యాధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూమిని, అదీ సాగునీటి కాలువను ఆక్రమించి నిర్మాణం చేపట్టిన సదరు నాయకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కబ్జాను తొలగిస్తారా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మౌనం వహిస్తారా? అన్నది వేచి చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.