పేదల పాలిట సంజీవని ‘సీఎంఆర్ఎఫ్’
అర్హులందరికీ పథకాల ఫలాలు అందిస్తాం: కాంగ్రెస్ నేతలు
కాకతీయ, కారేపల్లి : ఆర్థిక ఇబ్బందులతో ఖరీదైన వైద్యం చేయించుకోలేక సతమతమవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. బుధవారం సింగరేణి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకురి రాంబాబు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని తెలిపారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను చేరవేయడమే ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రధాన ధ్యేయమని, ఆయన నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో భజ్య తండా సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మేదరి వీరప్రతాప్ (టోనీ), ప్రముఖ వ్యాపారవేత్త సురేందర్ మణియార్, తాజుద్దీన్, హాట్కార్ రాంబాబు నాయక్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

