అల్లూరి సెంటర్లో బెల్ట్ షాపుల దందా
గుడి,కాలేజీల దగ్గర మద్యం విక్రయాలు
అర్ధరాత్రి వరకు అమ్మకాలు,గొడవలు
మహిళలు,విద్యార్థినులకు తీవ్ర ఇబ్బందులు
బెల్ట్ షాపులు వెంటనే తొలగించాలి
ఎక్సైజ్ సీఐకి బీఆర్ఎస్ నేతల వినతి పత్రం
కాకతీయ,కొత్తగూడెం ప్రతినిధి/పాల్వంచ : పాల్వంచ పట్టణంలోని అల్లూరి సెంటర్లో గుడి ప్రాంగణం,లోకల్ బస్టాండ్‌కు అతి సమీపంలో నడుస్తున్న బెల్ట్ షాపులు ప్రజలకు పెద్ద తలనొప్పి గా మారాయని పాల్వంచ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు.బుధవారం ఆబ్కారీ శాఖ ను సీఐకు కలిసి బెల్ట్ షాప్‌లపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో బెల్ట్ షాప్ వల్ల అనేక గొడవలు జరుతున్నాయని వారు ఆరోపించారు. గుడి వచ్చే భక్తులు,కాలేజీ విద్యార్థినులు, కేటీపీఎస్ ఉద్యోగులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 వరకు మద్యం అమ్మకాలు జరుగుతూ,రోడ్డుపై గొడవలు, అసభ్య ప్రవర్తనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. బెల్ట్ షాపులకు ఎలాంటి సమయపాలన లేకుండా ఇష్టారీతిన నడుపుతున్నారన్నారు.అంతేకాకుండా షాపుల పరిసరాల్లో బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం వల్ల ఆ ప్రాంతమంతా దుర్గంధంగా మారిందని వివరించారు.ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి,అల్లూరి సెంటర్లోని రెండు బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని నేతలు డిమాండ్ చేశారు.ప్రజల ఇబ్బందులను సావధానంగా విన్న ఎక్సైజ్ సీఐ సానుకూలంగా స్పందించి, సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వై.ఆర్.నాయుడు, రంగయ్య,దుర్గాప్రసాద్,ఆర్వీ రమణా చౌదరి, వాసుమల్ల గౌతం తదితరులు పాల్గొన్నారు.

