- బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ మాంగోలు చంటి
- విద్యార్థులకు డిక్షనరీలు, స్టీల్ ప్లేట్లు, పండ్ల పంపిణీ
కాకతీయ, చేర్యాల: తన మాతృమూర్తి మాంగోలు పుష్ప ద్వితీయ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ మాంగోలు చంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దమ్మగడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోవిద్యార్థులకు డిక్షనరీలు, స్టీల్ ప్లేట్లు, పండ్లు పంపిణీ చేసి నివాళులర్పించారు. మాతృమూర్తి సేవా భావాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చంటి తెలిపారు. విద్యార్థుల చదువుకు తోడ్పడేలా డిక్షనరీలు అందించడం అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

