epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పీఎంఈజీపీ రుణాలు

  • పీఎంఈజీపీ రుణాల్లో అక్ర‌మాలు
  • రూ.10 కోట్లకు పైగా సబ్సిడీల దుర్వినియోగం
  • ప్రీ-ప్రైమరీ, ఆయా పోస్టుల్లో మెరిట్‌ను పక్కనపెట్టి నియామ‌కాలు
  • రెండు వ్యవహారాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలి
  • బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోప‌ణ‌లు
  • రుణాలు, నియామకాల వివరాలను బహిరంగపరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
  • అక్రమాలకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్

కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) రుణాల మంజూరు, ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల నియామకాలలో భారీ అక్రమాలు జరిగాయని భారత రాష్ట్ర సమితి ఆరోపించింది. ఈ రెండు వ్యవహారాలపై తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఖమ్మంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఈజీపీ పథకాన్ని జిల్లాలో దళారులు, రాజకీయ నాయకులు, బ్యాంకు అధికారులు కుమ్మక్కై పక్కదారి పట్టించారని ఆరోపించారు. సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటు చేయకుండానే బినామీల పేర్లపై రూ.10 కోట్లకు పైగా సబ్సిడీలు విడుదల చేశారని విమర్శించారు. క్షేత్రస్థాయి పరిశీలన, జియో ట్యాగింగ్ నిబంధనలను పట్టించుకోకుండా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (డీసీసీబీ) అధికారులు రుణాలు మంజూరు చేశారని ఆరోపించారు. నిజమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా నిరుద్యోగులకు రుణాలు నిరాకరిస్తూ, పలుకుబడి ఉన్న వారికి సబ్సిడీలు మంజూరు చేశారని అన్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపించి సత్తుపల్లి బ్రాంచ్ మేనేజర్‌తో పాటు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

నియామకాల్లో మెరిట్‌కు తిలోదకాలు

ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల భర్తీలోనూ నిబంధనలను ఉల్లంఘించారని సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇంటర్వ్యూలు లేకుండా విద్యార్హతల ఆధారంగా మాత్రమే నియామకాలు చేపట్టాల్సి ఉండగా, ఖమ్మం జిల్లాలో డీఈఓ కార్యాలయం ఇంటర్వ్యూలకు అదనపు మార్కులు కేటాయించి మెరిట్‌ను పక్కనపెట్టిందని విమర్శించారు. బీఈడీ, డీఈడీ వంటి ఉన్నత అర్హతలు ఉన్న అభ్యర్థులను విస్మరించి రాజకీయ ఒత్తిళ్లతో నియామకాలు చేపట్టారని ఆరోపించారు. జిల్లాలో భర్తీ చేసిన 114 పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ మార్కులు, అలాగే దరఖాస్తు చేసుకున్న 1,400 మందికి పైగా అభ్యర్థుల వివరాలను వెంటనే బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. పీఎంఈజీపీ కింద మంజూరైన రుణాలు, సంబంధిత యూనిట్ల ఉనికిపై స్వతంత్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన ఇండస్ట్రీస్, ఖాదీ, బ్యాంకింగ్, విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అవసరమైతే ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిసి నిలదీస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఉప్పల వెంకటరమణ, బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, బిచ్చాల తిరుమల రావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, యలమద్ది రవి, బలుసు మురళీకృష్ణ, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.