కరీంనగర్లో బీజేవైఎం ఆందోళన
సీఎం దిష్టిబొమ్మ దహనయత్నం అడ్డుకున్న పోలీసులు
తోపులాట.. పలువురు కార్యకర్తలు అదుపులోకి
కాకతీయ, కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం తెలంగాణ చౌక్‌లో బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను మోహరించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పలువురు నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పీటీసీకి తరలించారు. ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం చేసిన వ్యాఖ్యలు అవమానకరమని ఆరోపించిన బీజేవైఎం నేతలు, వెంటనే వాటిని వెనక్కి తీసుకుని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

