తెలంగాణ స్ఫూర్తి జయశంకర్ సార్దే
ఖమ్మం తెలంగాణ భవన్లో ఘనంగా జయంతి వేడుకలు
ఆశయ సాధనకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిలుపు
కాకతీయ, ఖమ్మం : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను శుక్రవారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, మలిదశ తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజల్లో రగిలించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ సాధన కోసం ఆయన జీవితాంతం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర, మండల పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు, భాషబోయిన వీరన్న, కనగాల వెంకటరావు, మాజీ లైబ్రరీ చైర్మన్ ఖమర్, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు ఉప్పల వెంకట రమణ, బొమ్మెర రామ్మూర్తి, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ కార్పొరేటర్లు షేక్ మక్బూల్, తోట రామారావు, ఉద్యమకారులు పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, ఆసిఫ్, బురాన్, బొడ్డు గ్లోరి, రాజేష్, నాయకులు తాజుద్దీన్, మాటేటి నాగేశ్వరరావు, బుర్రి వెంకటేశ్వర్లు, బిరెడ్డి నాగచంద్రారెడ్డి, ముత్యాల వెంకటప్పారావు, బలుసు మురళీకృష్ణ, మహమ్మద్ రఫీ, యలమద్ది రవి, బోజెడ్ల రాంమోహన్, షేక్ షకీనా, బాసిపొంగు వెంకటేశ్వరరావు, సద్దాం తదితరులు పాల్గొన్నారు.

