బెస్ట్ అచీవ్‌మెంట్ అవార్డు సాధించిన హరీష్‌కు సన్మానం
కాకతీయ, హన్మకొండ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలో ‘బెస్ట్ అచీవ్‌మెంట్ అవార్డు’కు ఎంపికైన గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యుడు, ఆంధ్రజ్యోతి దినపత్రిక డిప్యూటీ చీఫ్ ఫొటోగ్రాఫర్ వీరగోని హరీష్‌ను గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ కమిటీ సన్మానించింది. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు ఆధ్వర్యంలో హరీష్‌కు శాలువా కప్పి, మెమొంటో అందజేశారు. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న హరీష్ భవిష్యత్తులో మరింత ప్రతిభ కనబరిచి మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొళ్ల అమర్, ఉపాధ్యక్షులు గోకారపు శ్యాం కుమార్, బొడిగె శ్రీను, అల్లం రాజేష్‌వర్మ, యంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలు సంపేట సుధాకర్, పెద్దపల్లి వరప్రసాద్, పోడిచెట్టి విష్ణువర్ధన్ పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులు జనగాని ఆంజనేయులు, ఎండి నయీమ్ పాష, కమటం వేణుగోపాల్, నన్నపనేని భరత్‌కుమార్, మంచాల రాజు, బలువారి విజయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

