ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
కాకతీయ, పెద్దవంగర : ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం పెద్దవంగర గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శంకర కంటి ఆసుపత్రి, నానక్‌రామ్‌గూడ కంటి హాస్పిటల్ సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పారిజాతసురేష్ మాట్లాడుతూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కంటి సమస్యలు ఏర్పడిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే చూపును కాపాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రగతి సేవా సమితి వ్యవస్థాపకులు గద్దల జాను, కార్యదర్శి వెంకన్న, మహబూబాబాద్ జిల్లా కోఆర్డినేటర్ పసునూరి యాకయ్య, పెద్దవంగర మండల కోఆర్డినేటర్ జలగం రామ్మూర్తి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

