తాడికల్ సర్పంచ్ దుర్గపు సుజాత కన్నుమూత
అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి.. ప్రముఖుల సంతాపం
కాకతీయ,శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత(46) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. సుజాత మృతికి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి తిరుపతి, మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, గట్టు తిరుపతిగౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుజాత మృతితో తాడికల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

