epaper
Tuesday, September 22, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దళితులు, గిరిజనులకు భరోసా

దళితులు, గిరిజనులకు భరోసా
ప్రభుత్వ పథకాలు.. కార్యక్రమాల్లో పెద్దపీట
ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వర న్యాయం
అట్రాసిటీ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
నష్టపరిహారం వెంటనే చెల్లించాలి.. గ్రీన్‌ ఛానెల్‌లో నిధులు
అత్యధిక కేసులున్న 73 గ్రామాలపై ప్రత్యేక నిఘా
హైలెవెల్‌ కమిటీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం–1989 అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నత నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశమైంది. చట్టం అమలు, కేసుల దర్యాప్తు, కోర్టు విచారణలు, పరిష్కారం, బాధితులకు పరిహారం, పునరావాస చర్యలపై సమీక్షించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ స్థాయి కమిటీ సమావేశం జరగడం ఇదే తొలిసారి. దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. పేదలకు 25 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములకు పట్టాలు అందించిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదని గుర్తుచేశారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ఇళ్ల కేటాయింపులోనూ ప్రాధాన్యం

రాష్ట్రంలో ఎస్సీల జనాభా దాదాపు 16 శాతం ఉండగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో 31 శాతం మంది ఎస్సీ వర్గాల లబ్ధిదారులు ఉన్నారని సీఎం వివరించారు. ఎస్టీల జనాభా 10 శాతం ఉంటే వారికి 17 శాతం ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఎస్సీ, ఎస్టీలపై నమోదవుతున్న అట్రాసిటీ కేసులు క్రమంగా తగ్గుతున్నట్లు అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అయితే కొన్ని జిల్లాల్లోని 73 గ్రామాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు వివరించారు. ఆయా గ్రామాలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. జిల్లా స్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

పరిహారం కోసం గ్రీన్‌ ఛానెల్‌

అట్రాసిటీ కేసుల బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బడ్జెట్‌ కేటాయింపులతో ముడిపెట్టకుండా గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా నిధులు విడుదల చేయాలని సూచించారు. బాధితుల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించాలని, సకాలంలో పరిహారం, సహాయం, పునరావాసం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలులో పరిహారం, పునరావాసం కీలక అంశాలుగా సమావేశంలో సమీక్షించారు. అట్రాసిటీ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాలు, మొబైల్‌ కోర్టుల పనితీరుపైనా సమావేశంలో చర్చించారు. నమోదైన కేసుల దర్యాప్తు ఏ దశలో ఉంది? కోర్టుల్లో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి? ఎన్ని పరిష్కారమయ్యాయి? బాధితులకు ఆర్థిక సహాయం ఎంతవరకు అందింది? వంటి అంశాలను సమీక్షించారు. చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాలపైనా చర్చ జరిగింది.

షాబాద్‌, తుక్కుగూడ కేసుల ప్రస్తావన

ఇటీవల జరిగిన షాబాద్‌ హత్యల కేసు, తుక్కుగూడలో నర్సుపై హత్యాచారం కేసులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయా ఘటనల్లో బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అట్రాసిటీ ఘటనల్లో కేసుల దర్యాప్తు, విచారణలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. చదువు ఒక్కటే జీవితాలను మార్చగలదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యతోనే సమాజంలో అసమానతలు, అణిచివేతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. పిల్లలను చదువుతోపాటు క్రీడల వైపు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రజలదేనని, వారి సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అల్పాహారం అందిస్తున్నామని, 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు.

కమిటీలో పలువురు ప్రముఖులు

సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్‌, కడియం కావ్య, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్‌, మట్టా రాగమయి, వెడ్మ బొజ్జు, మురళీ నాయక్‌, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌, రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ బక్కి వెంకటయ్య, జాతీయ ఎస్సీ కమిషన్‌ డైరెక్టర్‌ సునీల్‌బాబు, ఎస్సీ కమిషన్‌ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నయీం ఆస్తుల లెక్క తారుమారు..!

నయీం ఆస్తుల లెక్క తారుమారు..! 327 ఆస్తులపై జీవో.. గెజిట్‌ జారీ తూప్రాన్‌పేటలోనే ఎందుకీ...

రెబ్బెన గోదాం నుంచే రేషన్‌ దందా!

రెబ్బెన గోదాం నుంచే రేషన్‌ దందా! ప‌ట్ట‌ణ శివారులోనే భారీ స్టాకు పాయింట్‌ పీడీఎస్‌...

దానం నాగేంద‌ర్‌కు షాక్‌..!

దానం నాగేంద‌ర్‌కు షాక్‌..! పార్టీ ఫిరాయింపుపై ఎమ్మెల్యే అన‌ర్హ‌త వేటు బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి...

కొత్తగా చేర్చలేదు.. గతంలో ఉన్నవే!

కొత్తగా చేర్చలేదు.. గతంలో ఉన్నవే! 22ఏ జాబితాపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం ప్రభుత్వ భూములు...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.