epaper
Tuesday, September 22, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నయీం ఆస్తుల లెక్క తారుమారు..!

నయీం ఆస్తుల లెక్క తారుమారు..!
327 ఆస్తులపై జీవో.. గెజిట్‌ జారీ
తూప్రాన్‌పేటలోనే ఎందుకీ గందరగోళం?
22ఏ జాబితాలో కనిపించని భూములు
5.5 ఎకరాలు అప్‌లోడ్‌.. 40 ఎకరాల సంగతేంటి?
రిజిస్ట్రేషన్‌ యత్నంతో బయటపడిన వ్యవహారం
నయీం ఆస్తులు చేతులు మారుతున్నాయా?

కాకతీయ, తెలంగాణ బ్యూరో : గ్యాంగ్‌స్టర్‌ నయీం ఆస్తుల లెక్కలు మాయమవుతున్నాయా? ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చాలని స్పష్టంగా ఆదేశించిన ఆస్తుల్లోనే కొన్ని వివరాలు రికార్డుల్లో కనిపించకపోవడం వెనుక ఏముంది? నయీంకు చెందిన 327 ఆస్తులను 22ఏ(1)(ఈ) కింద చేర్చాలని జీవో జారీ చేసి.. గెజిట్‌ కూడా విడుదల చేసినా.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేటలోని భూముల విషయంలో మాత్రం రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేకపోవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. 5.5 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నించిన సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం.. అధికార యంత్రాంగం హడావుడిగా ఆ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం మరిన్ని ప్రశ్నలకు దారితీస్తోంది. అదే సమయంలో మరో సర్వే నంబర్‌లోని దాదాపు 40 ఎకరాల భూమి ఇంకా ప్రొహిబిటెడ్‌ జాబితాలో ఎందుకు స్పష్టంగా కనిపించడంలేదన్నది చర్చనీయాంశంగా మారింది. నయీం బెదిరింపులు, అరాచకాలతో భూములు కూడబెట్టుకున్నాడని పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతోపాటు కోర్టులను ఆశ్రయించారు. నయీం తన భార్య, బంధువులు, అనుచరుల పేర్లతో ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు దర్యాప్తు సంస్థల కేసుల్లో అంశాలు ఉన్నాయి. 2020 ఆగస్టు 8న ఎన్‌కౌంటర్‌లో నయీం మరణించిన తర్వాత అతడి ఆస్తులపై సిట్‌, ఈడీ తదితర సంస్థల దర్యాప్తులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో నయీంకు చెందిన 327 ఆస్తులను 22ఏ(1)(ఈ)లో చేర్చాలని ప్రభుత్వం ఆదేశించింది.

గెజిట్‌ ఉంది.. జాబితాలో లేవు

ప్రభుత్వం జీవో నంబర్‌ 206 జారీ చేసి.. అనంతరం గెజిట్‌ నంబర్‌ 149ను విడుదల చేసింది. గెజిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలను రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ వెబ్‌సైట్‌లోని ప్రొహిబిటెడ్‌ జాబితాలో నమోదు చేయాల్సి ఉంది. యాదాద్రి జిల్లాలోని పలు ఆస్తులను 22ఏ(1)(ఈ)లో అప్‌లోడ్‌ చేసినా.. చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేటలోని కొన్ని భూముల వివరాలు మాత్రం కనిపించకపోవడం ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. తూప్రాన్‌పేటలోని సర్వే నంబర్‌ 13ఏ, 14లో 5.5 ఎకరాల భూమి ఉంది. క్షేత్రస్థాయిలో అది ఖాళీ ప్లాట్లుగా ఉన్నప్పటికీ రికార్డుల్లో వ్యవసాయ భూమిగానే ఉన్నట్లు సమాచారం. ఈ భూమిలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు కొందరు శుక్రవారం చౌటుప్పల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ కేసుల కారణంగా రిజిస్ట్రేషన్‌ చేయలేమని సబ్‌ రిజిస్ట్రార్‌ చెప్పినా.. రికార్డుల్లో భూములు నిషేధిత జాబితాలో లేవని వారు వాదించినట్లు తెలుస్తోంది. దీంతో సబ్‌ రిజిస్ట్రార్‌ వ్యవహారాన్ని సీసీఎల్‌ఏ దృష్టికి తీసుకెళ్లారు.

సీసీఎల్‌ఏ ఆరా.. షోకాజ్‌ నోటీసు

తూప్రాన్‌పేట భూముల వివరాలు 22ఏ జాబితాలో ఎందుకు కనిపించలేదన్న అంశంపై సీసీఎల్‌ఏ నుంచి జిల్లా అధికారులకు వివరణ కోరుతూ ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. మరోవైపు గెజిట్‌లో పేర్కొన్న ఆస్తులను ప్రొహిబిటెడ్‌ లిస్టులో ఎందుకు చేర్చలేదని చౌటుప్పల్‌ తహసీల్దార్‌ వీరాబాయికి శుక్రవారం రాత్రి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా రెవెన్యూ అధికారులు హడావుడిగా రికార్డులను పరిశీలించారు.
వివాదం ముదరడంతో యాదాద్రి జిల్లా రెవెన్యూ అధికారులు శనివారం రాత్రంతా కసరత్తు చేసినట్లు సమాచారం. సర్వే నంబర్లు 13ఏ, 14లోని 5.5 ఎకరాల భూమి వివరాలను ఆదివారం ఉదయం 7.45 గంటలకు ప్రొహిబిటెడ్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. వివాదం వెలుగులోకి వచ్చిన వెంటనే వివరాలు అప్‌లోడ్‌ చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అసలు గెజిట్‌లో ఉన్న ఆస్తి ఇంతకాలం ఆన్‌లైన్‌ జాబితాలో ఎందుకు కనిపించలేదన్నదే ప్రశ్న.

ఆస్తులు చేతులు మారుతున్నాయా?

తూప్రాన్‌పేటలో మరో సర్వే నంబర్‌లో ఉన్న దాదాపు 40 ఎకరాల భూమి వివరాలు మాత్రం ఇంకా అప్‌లోడ్‌ కాలేదని తెలుస్తోంది. ఈ భూమికి సంబంధించి సిట్‌ నుంచి ఎన్‌వోసీ వచ్చిందని కొందరు అధికారులు చెబుతున్నట్లు సమాచారం. దర్యాప్తు సంస్థల నుంచి క్లియరెన్స్‌ వచ్చిన తర్వాతే ఆ భూములు చేతులు మారాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ 40 ఎకరాలు ప్రొహిబిటెడ్‌ సైట్‌లోని కోర్టు కేసుల విభాగంలో కనిపిస్తున్నట్లు సమాచారం. నయీం ఆస్తులను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశించిన నేపథ్యంలో.. అవి సురక్షితంగా ఉన్నాయా? ఇప్పటికే చేతులు మారాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూప్రాన్‌పేటలో 5.5 ఎకరాల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడం, రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నం జరగడం, ఆ తర్వాత హడావుడిగా వివరాలు అప్‌లోడ్‌ చేయడం.. మొత్తం వ్యవహారంపై మరిన్ని ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఇది అధికారుల నిర్లక్ష్యమా? సాంకేతిక లోపమా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆస్తులను జాబితాలోకి రాకుండా అడ్డుకున్నారా? అన్నది తేలాల్సి ఉంది.

మిగిలిన జిల్లాల్లోనూ తనిఖీ అవసరం

నయీంకు సంబంధించిన ఆస్తులు యాదాద్రితోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్‌, జగిత్యాల, సిద్దిపేట, మెదక్‌, మహబూబ్‌నగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో ఉన్నట్లు సమాచారం. తూప్రాన్‌పేట వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ జిల్లాల్లోని ఆస్తుల వివరాలు కూడా గెజిట్‌తో సరిపోల్చి పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. 327 ఆస్తుల జాబితాలో ఏ ఒక్క ఆస్తి వివరమూ మిస్‌ కాకుండా సమగ్రంగా ధ్రువీకరించాల్సి ఉంది. లేనిపక్షంలో నయీం ఆస్తుల రక్షణ కోసం తీసుకున్న ప్రభుత్వ చర్యలే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దళితులు, గిరిజనులకు భరోసా

దళితులు, గిరిజనులకు భరోసా ప్రభుత్వ పథకాలు.. కార్యక్రమాల్లో పెద్దపీట ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వర...

రెబ్బెన గోదాం నుంచే రేషన్‌ దందా!

రెబ్బెన గోదాం నుంచే రేషన్‌ దందా! ప‌ట్ట‌ణ శివారులోనే భారీ స్టాకు పాయింట్‌ పీడీఎస్‌...

దానం నాగేంద‌ర్‌కు షాక్‌..!

దానం నాగేంద‌ర్‌కు షాక్‌..! పార్టీ ఫిరాయింపుపై ఎమ్మెల్యే అన‌ర్హ‌త వేటు బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి...

కొత్తగా చేర్చలేదు.. గతంలో ఉన్నవే!

కొత్తగా చేర్చలేదు.. గతంలో ఉన్నవే! 22ఏ జాబితాపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం ప్రభుత్వ భూములు...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.