మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..
– మానాల, పరిసర తండాల్లో పర్యటన..
– బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా..
కాకతీయ, రుద్రంగి : రుద్రంగి మండలం మానాల గ్రామంతో పాటు పలు తండాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పర్యటించి ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధలో ఉన్న కుటుంబాలకు ధైర్యం చెబుతూ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్ తండాకు చెందిన మాలోత్ బాసు మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూప్ల తండా గ్రామ శాఖ అధ్యక్షులు భూక్యా చందర్ నాయక్ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఓదార్చారు. రూప్ల తండా మాజీ సర్పంచ్ భూక్యా రాజు నాయక్ తల్లి మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు. అడ్డబోర్ తండా మాజీ సర్పంచ్ మోహన్ అన్న బాపూరావు, వీరుని తండా సీనియర్ నాయకులు గుగులోత్ వర్జ్య భార్య సుబ్బమ్మ మృతితో వారి కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపారు.
మానాల గ్రామానికి చెందిన మెడికల్ శ్రీనివాస్ తల్లి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ పర్యటనలో రుద్రంగి మండల అధ్యక్షులు తిరుపతి నాయక్, మానాల సర్పంచ్ శంకర్ గౌడ్, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, రాజారామ్, నాయిని రాజేశం,నరహరి నాయక్, నరు నాయక్, బడితండా సర్పంచ్ రాందాస్, జూల భూమన్న, పిసరి రవీందర్, మాజీ సర్పంచ్లు, వివిధ తండాల గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

