epaper
Monday, September 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు

దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు
ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
హైకోర్టు తీర్పు మేరకు శాసనసభ నోటిఫికేషన్
23.04.2024 నుంచే అనర్హత అమలు
పదో షెడ్యూల్‌, రాజ్యాంగ నిబంధనల ప్రకారం చర్య
హైకోర్టు తీర్పు ఆధారంగా శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి ఉత్తర్వులు

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన దానం నాగేందర్‌ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయింది. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్‌ 18న ఇచ్చిన తీర్పు మేరకు ఆయనను శాసనసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి శనివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దానం నాగేందర్‌ సభ్యత్వం 23.04.2024 నుంచి అమల్లోకి వచ్చే విధంగా రద్దయినట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. హైకోర్టు డబ్ల్యూపీ నంబర్లు 8409, 8647/2026లో సెప్టెంబర్‌ 18న ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు శాసనసభ పేర్కొంది. 60 ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనసభకు ఎన్నికైన దానం నాగేందర్‌ పదో షెడ్యూల్‌లోని పేరా 2(1)(ఏ)తో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 191(2) ప్రకారం సభ్యత్వానికి అనర్హుడిగా నిలిచినట్లు గెజిట్‌లో పేర్కొన్నారు.

23.04.2024 నుంచే అమల్లోకి
దానం నాగేందర్‌ సభ్యత్వానికి సంబంధించిన అనర్హత 23.04.2024 నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. అదే తేదీ నుంచి ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ స్థానం ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ రాజ్య శాసనసభ అధికారిక గెజిట్‌లో ప్రకటన వెలువడింది. శనివారం హైదరాబాద్‌లో విడుదలైన తెలంగాణ రాజపత్రము ప్రత్యేక సంచికలో ఈ ప్రకటనను ప్రచురించారు. సీ.నెం.210/శాసన/2026గా జారీ చేసిన నోటిఫికేషన్‌పై శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి సంతకం చేశారు. హైకోర్టు తీర్పు ఆధారంగా సభ్యత్వ అనర్హత, నియోజకవర్గ స్థానం ఖాళీపై శాసనసభ అధికారికంగా ప్రకటన చేయడంతో ఖైరతాబాద్‌ స్థానానికి సంబంధించిన తదుపరి ఎన్నికల ప్రక్రియకు ఈ నోటిఫికేషన్‌ కీలక ఆధారంగా నిలవనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి

ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు...

ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం

ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం రాహుల్‌గాంధీ మాటలు నిజమని తేలింది ఓట్ల తొలగింపుపై...

37మంది అభ్య‌ర్థుల‌కు కాళోజీ వైద్య వ‌ర్సిటీ షాక్‌

37మంది అభ్య‌ర్థుల‌కు కాళోజీ వైద్య వ‌ర్సిటీ షాక్‌ ఎస్టీ కోటా వ‌ర్తించ‌దంటూ గిరిజ‌న...

కాళేశ్వరం బ్యారేజీలకు పునరుద్ధరణకు కార్యాచ‌ర‌ణ‌

కాళేశ్వరం బ్యారేజీలకు పునరుద్ధరణకు కార్యాచ‌ర‌ణ‌ నవంబర్‌ రెండో వారంలో పనులకు శ్రీకారం 2027 వానాకాలం...

ఉపఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేస్తాం

ఉపఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేస్తాం ఖైరతాబాద్‌ బరిలో తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వ వైఫల్యాలను...

ఉప‌పోరు..ఉత్కంఠ‌

ఉప‌పోరు..ఉత్కంఠ‌ ఖైరతాబాద్‌లో మూడు పార్టీల మోహరింపు! దానం నాగేందర్‌ చుట్టూనే కాంగ్రెస్‌ కసరత్తు సాయికిరణ్‌ యాదవ్‌...

గోదావరి వరదను వృథా చేయొద్దు

గోదావరి వరదను వృథా చేయొద్దు అన్ని మోటార్లు నడిపి రిజర్వాయర్లు నింపాలి కాళేశ్వరం జలాలను...

వ‌రంగ‌ల్ అభివృద్ధికి నిధులివ్వండి

వ‌రంగ‌ల్ అభివృద్ధికి నిధులివ్వండి కాకతీయ వర్సిటీకి పీఎం–ఉషా నిధులు తేవాలి పురావస్తు మ్యూజియానికి రూ.10...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.