సీఎం సభకు రుద్రంగి నుంచి భారీగా తరలివెళ్లాలి
ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున రావాలి
సభ విజయవంతానికి నాయకులు సమన్వయంతో పనిచేయాలి
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య పిలుపు
కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభకు రుద్రంగి మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య పిలుపునిచ్చారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని కోరారు. సభకు స్వచ్ఛందంగా వచ్చే ప్రజల కోసం వాహన సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల ప్రజాపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సభలో ప్రస్తావించనున్న నేపథ్యంలో ప్రజలు ఘన స్వాగతం పలకాలని అన్నారు. సభ విజయవంతానికి ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపసర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, మండల ఉపాధ్యక్షుడు అక్కినపెళ్లి శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దయ్యాల శ్రీనివాస్, ఫ్యాక్స్ డైరెక్టర్లు తర్రె మనోహర్, సనుగుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

