epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

త్యాగాలే పోలీసుల చరిత్రకు చిరునామా!

త్యాగాలే పోలీసుల చరిత్రకు చిరునామా!

ప్రజల రక్షణే లక్ష్యంగా ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళి

లింగంపేటలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం..

కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ మహేష్ బి.గితే హామీ

కాకతీయ, చందుర్తి: ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచి.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలనే త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

లింగంపేటలో ఘనంగా సంస్మరణ దినం

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మహేష్ బి.గితే, పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు కలిసి స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సాయుధ పోలీసులు శోక శస్త్ర నిర్వహించగా, దేశవ్యాప్తంగా గత ఏడాది నుంచి ఇప్పటివరకు విధి నిర్వహణలో అమరులైన 154 మంది పోలీసుల పేర్లను చదివి వినిపించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరుల సేవలను స్మరించుకున్నారు.

అమరవీరుల త్యాగాలతోనే మెరుగైన భద్రత

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం పోలీసులు ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అంతర్గత భద్రత విధుల్లో జిల్లాకు చెందిన ఎనిమిది మందికి పైగా పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. వారి త్యాగాలను ఎప్పటికీ మరువకూడదని, అమరవీరుల స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాల త్యాగం కూడా వెలకట్టలేనిదని భావించిన ఎస్పీ.. కార్యక్రమానికి హాజరైన కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు విన్నవించిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, జ్ఞాపికలను అందజేశారు.

అక్టోబర్ 31 వరకు అవగాహన కార్యక్రమాలు

పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేసేందుకు అక్టోబర్ 31 వరకు రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీలు, క్యాండిల్ ర్యాలీలు, రన్, ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు, ఫొటో, వీడియో పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రక్తదానం మహోన్నత సేవ

రక్తదానం మహోన్నత సేవ దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌...

చందుర్తికి రూ.91.75 లక్షల నిధులు

చందుర్తికి రూ.91.75 లక్షల నిధులు బాలికల విద్యాలయానికి రూ.58 లక్షలు తాగునీటి సమస్య పరిష్కారానికి...

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అభివృద్ధి పనులు, బిల్లులపై సమగ్ర విచారణ...

రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి

రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి ఎంపికైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం...

మానాల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ

మానాల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ కాకతీయ, రుద్రంగి: రుద్రంగి మండలం...

నిరుపేద కుటుంబానికి సీఎం సహాయనిధి అండ

నిరుపేద కుటుంబానికి సీఎం సహాయనిధి అండ దాసరి స్వామి వైద్యానికి రూ.3 లక్షల...

అక్రమంగా మొరం రవాణా.. టిప్పర్‌ పట్టివేత

అక్రమంగా మొరం రవాణా.. టిప్పర్‌ పట్టివేత అనుమతులు లేకుండా తరలిస్తుండగా గుర్తింపు అక్రమ రవాణాపై...

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి కానిస్టేబుల్‌ గుజ్జెటి మహేశ్‌కు ఎమ్మెల్యే, సీపీ నివాళి అమరుడి కుటుంబానికి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.