epaper
Friday, October 30, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పోలీస్‌ అమరవీరుల త్యాగాలను విస్మ‌రించొద్దు

పోలీస్‌ అమరవీరుల త్యాగాలను విస్మ‌రించొద్దు
సామాజిక సేవలో పోలీసుల ముందడుగు
వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ శ్వేత‌
సైకిల్‌ ర్యాలీతో ఆరోగ్యంపై అవగాహన
రక్తదాన శిబిరంలో 101 యూనిట్ల రక్తం సేకరణ
89 ఏళ్ల వయసులోనూ ర్యాలీలో పాల్గొన్న మామిడి నర్సయ్య

కాకతీయ, వరంగల్‌ బ్యూరో : పోలీస్‌ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్‌ ర్యాలీ, రక్తదాన శిబిరం సామాజిక బాధ్యతను చాటిచెప్పాయి. పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత, ఐపీఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో సైకిల్‌ ర్యాలీ ద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పించగా, భీమారం శుభం ఫంక్షన్‌ హాల్‌లో రెడ్‌క్రాస్‌ సంస్థ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 101 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. నగరంలోని వివిధ సైక్లిస్ట్‌ బృందాలకు చెందిన సుమారు 200 మంది ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్‌ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి సేవలను ఎప్పటికీ మరువకూడదని అన్నారు. సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో వ్యాయామానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. 60 ఏళ్లు పైబడిన వారు సైతం ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా 89 ఏళ్ల వయసులో ర్యాలీలో పాల్గొన్న మామిడి నర్సయ్యను ప్రత్యేకంగా అభినందించారు. వయస్సు వ్యాయామానికి అడ్డంకి కాదని ఆయన నిరూపించారని తెలిపారు. భీమారం శుభం ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన రక్తదాన శిబిరంలో సీపీ ఎన్‌. శ్వేత స్వయంగా రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం విలువైన ప్రాణాలను కాపాడుతుందని, ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సైకిల్‌ ర్యాలీని విజయవంతంగా నిర్వహించిన ఏఆర్‌ అదనపు డీసీపీలు వి. శ్రీనివాస్‌, సురేష్‌, ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌, మడికొండ ఇన్‌స్పెక్టర్‌ పుల్యాల కిషన్‌లను అభినందించారు. ర్యాలీలో హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి, ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ధార కవిత, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, ఏసీపీలు మధుసూదన్‌, సత్యనారాయణ, ఏఆర్‌ ఏసీపీలు నాగయ్య, అనంతయ్య, సురేంద్ర, ఇతర పోలీస్‌ అధికారులు, సీఐలు, ఎస్‌ఐలు, ఏఆర్‌ సిబ్బంది పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఇ.వి. శ్రీనివాస్‌ రావు, జిల్లా పాలక మండలి సభ్యుడు కె. రాకేష్‌ రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యార్థులకు 21 రకాల వస్తువులు వంద శాతం అందాలి

విద్యార్థులకు 21 రకాల వస్తువులు వంద శాతం అందాలి ఎంఆర్‌సీల్లో ఐటీడీఏ పీఓ...

గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల సమావేశాలు

గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల సమావేశాలు అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఆత్మ కమిటీ...

స్వేరో ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేద్దాం

స్వేరో ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేద్దాం నియోజకవర్గ కో- కన్వీనర్ జెల్ల ఉపేందర్ కాకతీయ,...

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం విద్యతోపాటు వ్యక్తిగత భద్రతపై అవగాహన అవసరం :...

దుగ్గొండి లో డీపీవో పర్యటన

దుగ్గొండి లో డీపీవో పర్యటన గ్రామ పంచాయతీ రికార్థుల పరిశీలన పారిశుధ్య పనుల...

ఆవిష్కరణలకు వేదిక‌ ‘టెక్నోజియన్‌’

ఆవిష్కరణలకు వేదిక‌ ‘టెక్నోజియన్‌’ నేటి నుంచి ఎన్‌ఐటీ వరంగల్‌లో సాంకేతిక సంబరం రెండు రోజుల...

అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి

అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి పెంచికలపేటలో బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం కాకతీయ,...

పెద్ది ఆశయ సాధనకు కదలాలి!

పెద్ది ఆశయ సాధనకు కదలాలి! పట్టభద్రుల ఓటరు నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి కాంగ్రెస్‌కు బుద్ధి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.