గౌడ. సంక్షేమ సంఘం
మండల మహిళాధ్యక్షురాలుగా లావణ్యగౌడ్
కాకతీయ, ఇనుగుర్తి : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఇనుగుర్తి మండల మహిళా అధ్యక్షురాలుగా చిన్న నాగారం గ్రామానికి చెందిన కురిమెల లావణ్యగౌడ్ ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా కేంద్రం మహబూబాబాద్ లో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రామచంద్రయ్య గౌడ్ మహిళా అధ్యక్షురాలుగా లావణ్య ను ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రామచంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గ సంక్షేమానికి,అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సందర్భంగా లావణ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ,గౌడ జాతి అభ్యున్నతి, సంక్షేమం,సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని సంఘం మండల మహిళా నూతన అధ్యక్షురాలు కురిమెల లావణ్య గౌడ్ తెలిపారు.తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టు రామచంద్రయ్య గౌడ్,జిల్లా అధ్యక్షులు గండి వీరేందర్ గౌడ్,ఉపాధ్యక్షులు గండి సాయి గౌడ్ యువజన సంఘం అధ్యక్షులు కరింగుల సాగర్ గౌడ్,జిల్లా మహిళా అధ్యక్షులు గండి శారద గౌడ్ లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

