కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా…
– మండల పార్టీ కార్యదర్శిగా జల్లెల్ల బాబు యాదవ్..
– 25 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుడికి మండల స్థాయిలో బాధ్యతలు
– కష్టపడిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ లోనే గుర్తింపు..
– ఎమ్మెల్యే రేవూరి, డీసీసీ అధ్యక్షులు ఇనగాల సహకారంతో ముందుకు సాగుత..
కాకతీయ, ఆత్మకూరు: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యదర్శి జల్లెల్ల బాబు యాదవ్ అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం మల్కాపేట గ్రామానికి చెందిన జల్లెల్ల బాబు యాదవ్కు మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.అనంతరం బాబు యాదవ్ మట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు. పార్టీ పట్ల తనకున్న నిబద్ధతతో గతంలో ఉపసర్పంచ్గా బాధ్యతలు నిర్వహించడంతో పాటు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సుమారు 10 సంవత్సరలు కాంగ్రెస్ పార్టీకి సేవలందించినట్లు అయన పేర్కొన్నారు.తనపై నమ్మకంతో మండల స్థాయి బాధ్యతలు అప్పగించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాం రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ నాయకులు తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తన నియామకానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతఙ్ఞతలు తెలిపారు…

