epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎన్నికల విధులను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలి

ఎన్నికల విధులను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలి
ప్రసార మాధ్యమాల ప్రకటనలపై నిఘా పెట్టాలి
ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామరావు
కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ప‌రిశీల‌న‌

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఎన్నికల విధులను అధికారులు ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు అన్నారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు, పంచాయతీ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, ఎంసిఎంసి సెల్, మీడియా సెంటర్లను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల కమీషన్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని, నిబంధనలను రూపొందించిందని వాటిని నిష్పక్షపాతంగా అమలు చేయడం మన కర్తవ్యమని అన్నారు.
1077 టోల్ ఫ్రీ నెంబర్, సామాజిక మాధ్యమాలలో, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే క్షేత్ర స్థాయిలో ఉన్న బృందాలకు తెలియజేసి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి మండలంలో పనిచేసే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలైన్స్ బృందాల వివరాలను నోటీస్ బోర్డు ద్వారా తెలియజేయాలని సూచించారు.

సామాజిక మాధ్య‌మాల‌పై నిఘా ఉంచాలి

సామాజిక మాధ్యమాల్లో ఎన్నికలకు సంబంధించి నిరంతరం పర్యవేక్షణ జరగాలని, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ వచ్చే ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ లో నమోదు చేసుకుని వెంటనే క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు, స్టాటిక్ సర్వేలెన్సు బృందాలకు సమాచారం అందించాలని అన్నారు. సామాజిక మాధ్యమాలలో ఎన్నికల నిర్వహణ పట్ల అపోహలు కలిగే దుష్ప్రచారాలు గమనించిన వెంటనే సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమాచారం చేరే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి బృందం మూడు షిఫ్టులలో 24 గంటల పాటు పనిచేస్తుందని, దానికి అనుగుణంగా సిబ్బంది నియామకం, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, డిపిఓ ఆశాలత, డీపీఆర్ఓ ఎం.ఏ. గౌస్, ఎంసిఎంసి కమిటీ సభ్యులు మురళి, రమేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.