epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మధ్యప్రదేశ్ సీఎం సింప్లిసిటీకి సలాం..

మధ్యప్రదేశ్ సీఎం సింప్లిసిటీకి సలాం..

టాక్ ఆఫ్ ది టౌన్‌గా కుమారుడి పెళ్లి!
సామూహిక వివాహ వేడుకలో తాళి కట్టిన మధ్యప్రదేశ్ సీఎం కొడుకు
రాందేవ్ బాబా వేదమంత్రాల సాక్షిగా జరిగిన పవిత్ర వివాహం
మోహన్ యాదవ్ నిర్ణ‌యంపై వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మరోసారి తన వినమ్రత, విలువలను దేశానికి చాటి చెప్పారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి జంబో లగ్జరీ వెడ్డింగ్‌లు చేసుకునే ఈ యుగంలో.. సీఎం మాత్రం పూర్తి భిన్న దారి పట్టారు. ఆడంబరానికి పూర్తిగా నో చెప్పి, తన కుమారుడి వివాహాన్ని నిరాడంబరంగా, సామాజిక సమానత్వానికి నిదర్శనంగా నిర్వహించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా ఒక ముఖ్యమంత్రి కుమారుడి పెళ్లంటే.. భారీ వేదికలు, ప్రత్యేక అలంకరణలు, సెలబ్రిటీ అతిథులు, వేలాది మంది సిబ్బంది అన్నీ కలసి కోట్ల బడ్జెట్‌తో జరిగే వేడుక. కానీ మోహన్ యాదవ్ మాత్రం ఈ లగ్జరీ రూట్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఉజ్జయినిలో జరిగిన సామూహిక వివాహ వేడుకలో మరో 21 జంటలతో పాటు తన కుమారుడు అభిమన్యు యాదవ్ వివాహం జరిపించడం ద్వారా దేశానికి అరుదైన సందేశం ఇచ్చారు.

ఈ వేడుకలో సుమారు 25,000 మంది ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ భారీ సమూహం మధ్య ఎక్కడా ఆడంబరపు హంగామా కనిపించలేదు. రాజకీయ ప్రభావం, శక్తి ప్రదర్శన, కోట్ల ఖర్చు.. ఇవేమీ లేవు. ఒక సాధారణ కుటుంబం చేసుకునేలా, మానవీయత, సమానత్వం, సంస్కృతి ముఖ్యమని చూపించేలా ఈ పెళ్లి జరిగింది. వేదమంత్రాల మధ్య యోగా గురు రాందేవ్ బాబా నేతృత్వంలో అభిమన్యు-ఇషిత వివాహం సాంప్రదాయబద్ధంగా పూర్తయ్యింది. ఈ ఘట్టం చూసిన జనాలు.. మోహన్ యాదవ్ సింప్లిసిటీకి స‌లాం చెబుతున్నారు. ఇలాంటివాళ్లే నిజమైన ప్రజానాయకులు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సమాజంలో పెళ్లిళ్ల పేరిట జరిగే అనవసరపు ఖర్చులు, లగ్జరీ పోటీలు పెరుగుతున్న సమయంలో మోహన్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి స్ఫూర్తిగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.