epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు.. ఉక్రెయిన్ స్ట్రాటజీకి రష్యా షాక్

చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు.. ఉక్రెయిన్ స్ట్రాటజీకి రష్యా షాక్
కాస్పియన్ సముద్రంలో ఉద్రిక్తతలు
రష్యా చమురు క్షేత్రాలే టార్గెట్ గా ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
యూరప్ నుంచి భారీ మద్దతు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాది దాటుతున్నా..రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మాత్రం ఒక్కరోజు కూడా తగ్గడం లేదు. శాంతి చర్చలు కొనసాగుతూనే ఉన్నప్పటికీ, భూమిపై మాత్రం మరింతగా అగ్ని రాజకీయాలు చెలరేగుతున్నాయి. తాజాగా కాస్పియన్ సముద్రంలోని రష్యా కీలక చమురు క్షేత్రాన్ని ఉక్రెయిన్ లాంగ్-రేంజ్ డ్రోన్లు టార్గెట్ చేయడంతో పరిస్థితి కొత్త మలుపు తిరిగింది.

ఉక్రెయిన్ సైనిక ఉన్నతాధికారి వెల్లడించిన వివరాల ప్రకారం… రష్యా యుద్ధానికి ముఖ్యమైన ఆదాయ వనరు అయిన చమురు ఎగుమతులను దెబ్బతీయడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశం. చమురు రిజర్వాయర్లను లక్ష్యంగా చేసుకొని ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రోన్లను ప్రయోగించామని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. రష్యా ఆర్థిక బలం కాస్తా యుద్ధాన్ని మరింత దీర్ఘకాలం నెట్టేస్తోందని భావిస్తున్న కీవ్… ఇప్పుడు ఆయా వనరులపైనే దాడులు చేస్తూ స్ట్రాటజీ మార్చింది.

ఇది ఒక్క దాడితో ముగియదని కూడా ఉక్రెయిన్ సంకేతాలిచ్చింది. రష్యా చమురు క్షేత్రాలు, ఇంధన మౌలిక వసతులు, నిల్వ కేంద్రాలు తదితర ప్రాంతాలపై మరిన్ని ఆపరేషన్లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి దాడులు రష్యా ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాదు… యుద్ధ సామర్థ్యాన్ని కూడా బలహీనపరుస్తాయని ఉక్రెయిన్ నమ్ముతోంది. చమురు క్షేత్రాలు టార్గెట్‌ కావడం రష్యాకు పెద్ద షాక్‌గా మారింది.

ఇక‌పోతే ఉక్రెయిన్ ఆర్మీకి ప్రస్తుతం యూరప్ దేశాల నుంచి భారీ సైనిక సహాయం అందుతోంది. తేలికపాటి యుద్ధ ట్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థలు, యాంటీ-ట్యాంక్ మిసైల్స్, సూపర్-ప్రెసిషన్ ఆయుధాలను ఇప్పటికే ఇచ్చామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. రష్యా దాడులు కీవ్‌పై ఆగకపోవడంతో… మరింత సహాయాన్ని అందించాలని ఆయన యూరప్ నేతలను కోరుతున్నారు. ఉక్రెయిన్ ఆర్థిక పునర్నిర్మాణం, ఆయుధ సప్లై, భద్రతా ఒప్పందాలపై త్వరలో అమెరికాతో ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. యుద్ధం దీర్ఘకాలం సాగుతున్న నేపథ్యంలో, అమెరికా మద్దతు ఉక్రెయిన్‌కు కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదే సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. గత నెలలోనే సుమారు 25,000 మంది ప్రాణాలు కోల్పోయారని, శాంతి చర్చలు ఫలితం చూపకపోవడం తీవ్రంగా కలిచివేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా దాడులు, ప్రతిదాడులు కొనసాగితే… మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాన్ని తిరస్కరించలేమని ట్రంప్ హెచ్చరిస్తూ ప్రపంచ నాయకులు బాధ్యతాయుతంగానే వ్యవహరించాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.