epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ముందస్తు అప్రమత్తతతో నష్టాల నివారణ

ముందస్తు అప్రమత్తతతో నష్టాల నివారణ
విపత్తుల నిర్వహణకు ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్
22న బూర్గంపాడులో మాక్ డ్రిల్
భ‌ద్రాద్రి కలెక్టర్ జితేష్ పాటిల్

కాకతీయ, కొత్తగూడెం : ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తుల సమయంలో సమర్థవంతమైన స్పందనతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు అప్రమత్తత అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో విపత్తుల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (ఈఓసి)ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనలతో కలిసి జిల్లా కలెక్టర్ విపత్తుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విపత్తుల సమయంలో జిల్లాలో ఈఓసి కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందులో జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ, ఇరిగేషన్, వైద్య, ఫైర్, పోలీస్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ తదితర విభాగాలు సభ్యులుగా ఉండాలని తెలిపారు. విపత్తు పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సామాగ్రి, వనరులు, కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉంచాలని సూచించారు. వర్షపాతం వివరాలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నీటిమట్టం, నీటి విడుదల, వంతెనలు, రోడ్ల ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలపై రియల్ టైమ్ సమాచారం ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు. జిల్లా మ్యాప్‌తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల మ్యాపులు సిద్ధంగా ఉంచాలని తెలిపారు.

పునరావాస కేంద్రాల సిద్ధత
వరదలు సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలు, పునరావాస కేంద్రాల గుర్తింపు, అక్కడ కల్పించాల్సిన సదుపాయాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య, అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ, విద్యుత్, తాగునీరు, మునిసిపల్ సేవలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లు, హెల్ప్‌లైన్ వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. లైఫ్ జాకెట్లు, బోట్లు తదితర రక్షణ సామాగ్రి అందుబాటులో ఉంచాలని, పోలీస్ విభాగం ద్వారా సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గోదావరి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన కార్యాచరణ ఉండాలని, దీనిని ఆచరణలో పరీక్షించేందుకు ఈ నెల 22న బూర్గంపాడులో మాక్ డ్రిల్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మాక్ డ్రిల్ సందర్భంగా శాఖల మధ్య సమన్వయం, స్పందన వేగం, రక్షణ చర్యలు, సహాయక సేవల అందుబాటు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.