epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మున్సిపల్ పోరుకు పార్టీల సర్వేలు..!

మున్సిపల్ పోరుకు పార్టీల సర్వేలు..!
అభ్యర్థుల ఎంపికపై నేతల నిఘా
ఓటర్ల జాబితాపై కసరత్తు
వార్డుల రిజర్వేషన్లపై హాట్ టాపిక్

కాకతీయ, రామకృష్ణాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యచరణకు వేగం పెరిగింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నూతన ఆంగ్ల సంవత్సరం 2026 జనవరిలో వెలువడే అవకాశముందని సమాచారం. దీంతో పార్టీల నేతలు, ఆశావాహుల్లో ఉత్కంఠ మొదలైంది. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లే కొనసాగుతాయా? లేక మార్పులు ఉంటాయా? అనే అంశంపై ఆశావాహుల్లో అనుమానాలు నెలకొన్నాయి. అయితే అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం వార్డుల రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు చేసేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో గెలిచిన మాజీ ప్రజాప్రతినిధులకు చెక్ పెట్టేలా కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. దీంతో రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్‌గా మారింది.

అభ్యర్థులపై పార్టీల సర్వేలు

మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు సర్వేలను ముమ్మరం చేశాయి. ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు కూడా పుర వార్డుల్లో పర్యటిస్తూ గ్రౌండ్ రిపోర్ట్‌ను అధిష్ఠానానికి పంపిస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఇప్పటికే తమ సర్వేలను దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. ఆలస్యమైన పుర పోరుకు పట్టణ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని క్యాతన్‌పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ‘కాకతీయ’ ప్రతినిధికి తెలిపారు. అప్పటి ఓటర్ జాబితా ప్రకారం 22 వార్డుల్లో 29,785 మంది ఓటర్లు ఉన్నారని, వార్డు వారీగా నూతన ఓటర్ జాబితాను సిద్ధం చేస్తామని చెప్పారు. వార్డుల సంఖ్య, రిజర్వేషన్ల మార్పులు రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.