epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పిల్లలతో వెట్టిచాకిరి చేస్తే క్రిమినల్ కేసులు

పిల్లలతో వెట్టిచాకిరి చేస్తే క్రిమినల్ కేసులు
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమ‌ష్టి పోరాటం
బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్–100కు సమాచారం ఇవ్వాలి
జనవరి 1 నుంచి 31 వరకు ‘ఆపరేషన్ స్మైల్’
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్‌

కాకతీయ, కొత్తగూడెం : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటుపడాలని, చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తే కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే 1098 లేదా డయల్–100కు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్, హెల్త్ డిపార్ట్మెంట్ల అధికారులతో శుక్రవారం ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ రోహిత్ రాజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, ఇల్లందు, మణుగూరు అనే ఐదు సబ్ డివిజన్లలో ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేసి సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

బాలల రక్షణే లక్ష్యం

18 సంవత్సరాల లోపు పిల్లలు కిరాణా షాపులు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ కనిపిస్తే వెంటనే గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా అవసరమైతే చైల్డ్ కేర్ హోమ్‌కు తరలిస్తామని తెలిపారు. రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను కూడా గుర్తించి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. చిన్నపిల్లలతో బలవంతంగా భిక్షాటన చేయించడం, వెట్టిచాకిరి చేయించిన వారిపై నూతన చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్–100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారి ముఖాల్లో చిరునవ్వులు నిలిచేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశంలో ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ రాము, డీడబ్ల్యూవో స్వర్ణలత లెనినా, సిడబ్ల్యూసీ సభ్యులు అంబేద్కర్, సాదిక్ పాషా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు షర్ఫుద్దీన్, డీసీపీవో హరి కుమారి, చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ సందీప్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామ్స్ మాధవరావు, కెఎస్‌సీఎఫ్ కో–ఆర్డినేటర్ రాజేష్, షీ టీం ఎస్సై రమాదేవి, ఎస్సైలు విజయ, రాజేష్, సమ్మిరెడ్డి, రాఘవయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.