epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం
రూ.35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశాలు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు పర్యటించనున్నారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని, భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నిధులతో చేపట్టనున్న ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఉదయం హైదరాబాద్ మాధాపూర్ నివాసం నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కొండగట్టు జేఎన్టీయూ హెలిప్యాడ్‌కు చేరుకుని, అనంతరం రోడ్డు మార్గంలో ఆలయానికి వెళ్తారు. ఉదయం 10.30 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం, టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆలయాభివృద్ధి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

రూ.35.19 కోట్లతో ఆలయాభివృద్ధి

భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న ఈ అభివృద్ధి పనుల కోసం టీటీడీ రూ.35.19 కోట్ల నిధులను కేటాయించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా కొండగట్టుకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఆలయాభివృద్ధి దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విప్ పిడుగు హరీ ప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ బోర్డు సభ్యులు తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. శంకుస్థాపన అనంతరం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అలాగే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన అభ్యర్థులతో ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని కొడిమ్యాల సమీపంలోని బృందావన్ రిసార్ట్‌లో ఏర్పాటు చేశారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కొండగట్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆలయ ఈవో శ్రీకాంత్ రావు సంబంధిత అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వెయ్యి మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఆలయ పరిసరాల్లో గట్టి భద్రతా వలయం అమలు చేస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ జరగనుండటంతో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వేల సంఖ్యలో తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అదనపు భద్రతా చర్యలు కొనసాగిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.