epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నాడు దోస్తీ… నేడు కుస్తీ!

నాడు దోస్తీ… నేడు కుస్తీ!
గూడెంలో మొద‌లైన‌ రాజ‌కీయ వేఢీ
ఫిబ్రవరిలో కొత్త‌గూడెం బ‌ల్దియా ఎన్నికల‌కు అవ‌కాశం
ఇప్ప‌టికే మొద‌లైన ఎన్నిక‌ల‌ ప్ర‌క్రియ‌.. ఓట‌రు జాబితా స‌న్న‌ద్ధం
మేయర్‌ కుర్చీపై బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఐ పార్టీల కన్ను
మున్సిపల్‌ బరిలో కాంగ్రెస్‌–కమ్యూనిస్టు త‌ల‌ప‌డే అవ‌కాశం..?

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం నియోజకవర్గంలో మున్సిపల్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పాల్వంచ మున్సిపాలిటీని విలీనం చేస్తూ కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయడంతో, ఈ ఏడాది తొలిసారిగా కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశముండటంతో ఇప్పటికే ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో అన్ని పార్టీల దృష్టి మేయర్‌ కుర్చీపైనే నిలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌–సీపీఐ పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటు సీపీఐకి కేటాయించగా, బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లును ఓడించి సీపీఐ నేత కూనంనేని విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో మిశ్రమ ఫలితాలు రావడంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారుతున్నాయి. బీఆర్ ఎస్ పార్టీ పుంజుకుంటున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో త‌మ‌కు సీట్లు కేటాయించ‌కుంటే పార్టీలో ప‌రిస్థితి మారుతుందంటూ కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్లుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇదీ కార్పొరేషన్‌ స్వరూపం
పాల్వంచ మున్సిపాలిటీని కొత్తగూడెం మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పాటు, సుజాతనగర్‌ మండలానికి చెందిన మంగపేట, నర్సింహసాగర్, నాయకులగూడెం, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌, నిమ్మలగూడెం, కోమటిపల్లి గ్రామ పంచాయతీలను కలిపి కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇదివరకు కొత్తగూడెంలో 33, పాల్వంచలో 24 వార్డులు ఉండగా, తాజా పునర్విభజనతో మొత్తం 60 డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఈ మార్పుతో కార్పొరేషన్‌ ఎన్నికలు మరింత కీలకంగా మారాయి.

2020లో బీఆర్ఎస్‌దే పైచేయి
2020లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్‌ (ప్రస్తుత బీఆర్ఎస్‌) స్పష్టమైన ఆధిపత్యం చాటింది. మొత్తం 33 వార్డులకు గాను బీఆర్ఎస్‌ – 18, సీపీఐ – 6, కాంగ్రెస్‌ – 4, సీపీఐ(ఎం) – 1,ఇతరులు – 4
వార్డులను గెలుచుకున్నారు. ఆ ఎన్నికల అనంతరం కాపు సీతాలక్ష్మి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అప్పట్లో బల్దియాపై కారు పార్టీదే పట్టు కొనసాగింది.

కాంగ్రెస్‌ వర్సెస్‌ కమ్యూనిస్టు..?

ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పొత్తుతో బరిలో దిగిన కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు… రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి సిద్ధమవుతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో సీపీఐ–కాంగ్రెస్‌ మధ్య నేరుగా పోరు తప్పదన్న చర్చ సాగుతోంది.
మరోవైపు బీఆర్ఎస్‌ కూడా కార్పొరేషన్‌ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జిల్లాపర్యటనలు ఖరారు కావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. నాడు పొత్తు… నేడు పోటీగా మారుతుండటంతో కొత్తగూడెం మున్సిపల్‌ రాజకీయాలు ‘నువ్వా… నేనా…’ అన్న దశకు చేరాయి. మేయర్‌ పీఠం ఎవరి వశమవుతుందోనన్న ఉత్కంఠతో ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.