epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గడువు ముగిసినా గందరగోళమే!

గడువు ముగిసినా గందరగోళమే!
ఓటర్ల జాబితాపై తొలగని అనుమానాలు
చివరి రోజున కూడా వెల్లువెత్తిన అభ్యంతరాలు
ఇప్ప‌టి వ‌ర‌కు 249 మంది నుంచి ఫిర్యాదులు
ఓట్ల గ‌ల్లంతు.. జాబితాలో త‌ప్పిదాల‌పై ఆందోళ‌న‌
తుది జాబితాపై విశ్వాసం డోలాయమాన‌మేనా..?!

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగరంలో విడుదలైన మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితా తీవ్ర గందరగోళానికి కేంద్రంగా మారింది. అభ్యంతరాల స్వీకరణకు నిర్ణయించిన గడువు ముగిసినప్పటికీ జాబితా ఖచ్చితత్వంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు ఏమాత్రం తగ్గడం లేదు. చివరి రోజున కూడా పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు నమోదు కావడంతో మొత్తం అభ్యంతరాల సంఖ్య 249కు చేరింది. ఇది ఓటర్ల జాబితా తయారీలో జరిగిన లోపాల తీవ్రతను స్పష్టంగా చాటుతోంది. ముసాయిదా జాబితా విడుదలైన మొదటి రోజు నుంచే అభ్యంతరాల వెల్లువ కొనసాగింది. గడువు చివరి రోజుకూ అదే పరిస్థితి కొనసాగడం అధికారుల పనితీరుపై విమర్శలకు దారి తీస్తోంది. ఒక డివిజన్‌కు చెందిన ఓట్లు మరో డివిజన్‌లో నమోదవడం, ఇంటి నంబర్లు లేకుండానే వందలాది ఓటర్ల పేర్లు జాబితాలో ఉండటం, కొన్ని డివిజన్లలో అకస్మాత్తుగా ఓట్ల సంఖ్య పెరగడం వంటి అంశాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి.

66 డివిజన్లలోనూ లోపాలేనా?

నగరంలోని 66 డివిజన్లలోనూ ఓటర్ల జాబితా లోపాలతో నిండిపోయిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గత గణాంకాలకు పొంతన లేకుండా కొన్ని డివిజన్లలో ఓట్ల సంఖ్య భారీగా పెరగడం, మరికొన్నింటిలో తగ్గిపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇంటి నంబర్లు, నివాస వివరాల ధృవీకరణ లేకుండా ఓటర్లను చేర్చడం వల్ల జాబితా ఖచ్చితత్వంపైనే కాదు, మొత్తం ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపైన కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసినప్పటికీ కేవలం కొద్ది రోజుల్లోనే 249 ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సరిదిద్దడం సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోపాలతో కూడిన జాబితానే తుది రూపం దాలిస్తే రానున్న మున్సిపల్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు, పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడువు ముగిసినా ఓటర్ల జాబితాపై కొనసాగుతున్న ఈ గందరగోళం తుది జాబితా విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. అధికారులు విడుదల చేయనున్న తుది ఓటర్ల జాబితా నిజంగా నమ్మకంగా ఉంటుందా? లేక కొత్త వివాదాలకు దారి తీస్తుందా? అన్న ఉత్కంఠే ఇప్పుడు కరీంనగర్ నగర రాజకీయ, సామాజిక వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.